హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం వంటి సినిమాలతో యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్న హీరో వరుణ్ సందేశ్.. ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. 'పడ్డానండి ప్రేమలో మరి' సినిమాలో వరుణ్ సరసన హీరోయిన్గా నటించిన వితికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వరుణ్. హైదరాబాద్ శివారులోని అలంకృత రిసార్టు వేదికగా శుక్రవారం తెల్లవారుజామున వీరి వివాహం వైభవంగా జరిగింది. వధువు మెడలో మంగళ సూత్రం కట్టగానే ఆమె నుదిటి మీద ముద్దు పెట్టుకుని ప్రేమను వ్యక్తపరిచాడు ఈ యువ హీరో. దాంతో పురోహితుడితో సహా చుట్టూ ఉన్న బంధుగణమంతా ముసిముసి నవ్వుల్లో మునిగిపోయారు.
కాగా వివాహానికి హాజరుకాలేకపోయిన మోహన్ బాబు ఆదివారం వరుణ్ సందేశ్ స్వగృహానికి చేరుకుని నూతన వధూవరులకు ఆశీస్సులను అందజేశారు. కలెక్షన్ కింగ్ రాకతో పెళ్లికొడుకు సంతోషంలో మునిగిపోయాడు. అదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. వరుణ్.. మోహన్ బాబుతో కలిసి 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమాలో కలిసి నటించారు. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల నుంచి వరుణ్ సందేశ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.