Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jul-2017 10:10:29
facebook Twitter Googleplus
Photo

సెప్టెంబర్ 21న జై లవ కుశ థియేటర్లలోకి వస్తుందని తేల్చేశాడు. ఈ రిలీజ్ డేట్ కారణంగా.. నందమూరి అభిమానులు అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. దసరా పండుగ సెలవలు మొత్తాన్ని ఎన్టీఆర్ క్యాష్ చేసుకుంటాడని ఫిక్స్ అయిపోయారు.

కానీ జై లవ కుశ రిలీజ్ డేట్ పై ఓ వర్గం మాత్రం ఏ మాత్రం హ్యాపీగా లేదు. వారెవరో కాదు.. ఈ సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్స్. సెప్టెంబర్ 1న ఈ సినిమా రిలీజ్ అవుతుందనే అంచనాల కారణంగా.. అక్కడి నుంచి మూడు వారాల పాటు ఎన్టీఆర్ సినిమాకు పోటీ ఉండదనే ఉద్దేశ్యంతో.. చాలామంది భారీ రేట్లకే కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ 20 రోజులు వెనక్కి వెళ్లిపోవడంతో దసరా సినిమాలతో పోటీ పడక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పండుగ నాటికే తమ సినిమా రిలీజ్ చేస్తామని.. ఇప్పటికే మహేష్ బాబు తో స్పైడర్ చేస్తున్న మురుగదాస్.. నందమూరి బాలకృష్ణతో పైసా వసూల్ మూవీ తీస్తున్న పూరీ జగన్నాధ్ చెప్పేశారు.

ఈ పరిస్థితిలో ఆ రెండు సినిమాలతో జై లవ కుశ పోటీ పడాల్సి ఉంటుంది. ఒకవారం మాత్రమే ఎన్టీఆర్ మూవీకి స్కోప్ ఉంటుంది. ఒక వేళ ఒకటే డేట్ కి జై లవ కుశ.. స్పైడర్ వస్తే మాత్రం.. అప్పుడు పరిస్థితి మరింత క్రిటికల్ అయిపోతుందని.. మురుగదాస్ మూవీ కావడంతో స్పైడర్ కు ఎడ్జ్ ఉంటుందని అంటున్నారట బయ్యర్స్. అందుకే జై లవ కుశ విడుదల తేదీ ముందుకు జరపాలని నిర్మాత కళ్యాణ్ రామ్ ని అడుగుతున్నా.. షూటింగ్ ప్రోగ్రెస్ ప్రకారం ఆ ఛాన్స్ లేదని చెప్పేశాడట ప్రొడ్యూసర్.

,  ,  ,  ,  ,  ,