Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Apr-2017 11:07:29
facebook Twitter Googleplus
Photo

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.. తను నటిస్తే దాన్ని తలదన్నేలా చేసే నటుడు ఇండియాలో కనిపించరు. విలక్షణ - ప్రయోగం - హావభావాలు ఇవి మనకు చాల గొప్ప పనులు. అతనికి ఇవి సాధారణం. ఎందుకంటే నా పని అదే కాబట్టి అంటూ చాల సాదాగా చెప్పేస్తారు. అయన సినిమాలు సాధారణంగా తమిళ్ మలయాళం లో రిలీజ్ అవుతూ ఉంటాయీ. ఈ మధ్య తెలుగులో కూడా అవుతున్నాయ్. మన్యం పులి - కనుపాప మంచి విజయాలు దక్కించుకున్నాయి. మనమంతా ఒక మోస్తరుగా ఆడింది నిన్న జనతా గ్యారేజ్ హిట్. బాగానే ఉన్న ఆయనకు ఈ మధ్య ఒక కోరిక పుట్టింది. పదండి చూద్దాం.

ఇప్పుడు వివాదాల రామ్ గోపాల్ వర్మ వర్మ పేరు వింటేనే చాలా మంది భయపడుతున్నారు. అతను కూడా తన స్థాయి కథలు - పనితనానికి సరిపడే పనులు చేయటం లేదు. కాని మోహన్ లాల్ మాత్రం.. రామ్ గోపాల్ వర్మ డైరక్షన్ లో ఒక్క సినిమాలో అయినా నటించాలి అంటున్నాడు. ఇప్పుడు మోహన్ లాల్ ఎందుకు అలా అన్నాడో అతనికే తెలియాలి. వీళ్ళు ఇద్దరు ముందు అంటే దాదాపు 15 ఏళ్ళు కిందట కంపెనీ అనే హిందీ సినిమా లో కలిసి పని చేసారు. అది అప్పటిలో ఒక ప్రభంజనం. ఇప్పుడు వర్మ సర్కార్ 3 రిలీజ్ పనుల్లో బాగా బిజీ గా ఉన్నారు . దాని తరువాత ఇంకో ఇంగ్లీష్ ఫిల్మ్ కోసం వర్మ ప్రయత్నం చేస్తున్నారు అని ఒక కబురు ఉంది. అటు మోహన్ లాల్ కూడా బాగా బిజీ గానే ఉన్నారు వరుస ఫిలిమ్స్ తో. విలన్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు.

,  ,  ,  ,  ,