Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jan-2016 16:51:29
facebook Twitter Googleplus
Photo

భారత క్రికెట్ కెప్టెన్ ధోని స్టయిలే వేరు. ఆటలోనే కాదు.. ఎందులోనైనా సరే ఎలాంటి పరిస్థితులకైనా ఈజీగా అడాప్ట్ అయిపోవడం అతడికే చెల్లుతుంది. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడుతూ తమిళులకు బాగా చేరువైపోయాడు ధోని. తమిళ తంబీలు ధోనిని తమ వాడిగానే భావిస్తున్నారు. తమిళ కల్చర్ కు తేలిగ్గా అలవాటు పడిపోయి.. వాళ్లలో ఒకడిగా ప్రవర్తిస్తూ తమిళ జనాల్లోకి చొచ్చుకుపోయాడు ధోని. ప్రతి ఐపీఎల్ సీజన్ కు ముందు తమిళ అభిమానులు మెచ్చేలా అతను చేసే యాడ్స్ భలే ఆకట్టుకుంటూ ఉంటాయి. ?విజిల్ పోడు? లాంటి యాడ్స్ లో నటించడం ధోనికే చెల్లు.



తాజాగా మరోసారి తమిళుల అభిమానాన్ని చూరగొనే యాడ్ ఒకటి చేశాడు ధోని. అది టీవీఎస్ బైక్ కు సంబంధించిన ప్రకటన. దీని కోసం పంచె కట్టేశాడు ధోని. షో రూంలో టీవీఎస్ బైక్ చూసి అబ్బుర పడుతుంటే సేల్స్ మన్.. బండి కీ ఇచ్చి నడపమంటాడు. కానీ పంచె తో ఉండి.. బండి మీద ఎలా ఎక్కి కూర్చోవడం అని సందేహిస్తాడు ధోని. అప్పుడే తన బ్యాచ్ తో కలిసి షోరూంలోకి ఎంట్రీ ఇస్తాడు ప్రభుదేవా. పంచె ఎగ్గట్టి బండి మీద ఎలా కూర్చోవాలో చూపిస్తూ స్టెప్పులేస్తాడు ప్రభు. ధోని కూడా అతడికి జత కలుస్తాడు. ఇద్దరూ కలిసి స్టెప్పులు ఇరగదీసేస్తారు. ధోని ఈ యాడ్ కు తగ్గట్లు తన బాడీ లాంగ్వేజ్ మార్చుకుని.. ప్రభుదేవాతో కలిసి స్టెప్పులేసిన తీరు సూపర్బ్ అని చెప్పాలి. ఈ యాడ్ చూశాక ధోనికి ధోనీనే సాటి అని ఒప్పుకోక తప్పదు.

,  ,  ,  ,