Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Apr-2017 14:17:17
facebook Twitter Googleplus
Photo

తమిళ ప్రేక్షకుల టేస్టు వేరు.. తెలుగు ఆడియన్స్ టేస్టు వేరు. అక్కడ రియలిస్టిగ్గా ఉండే సినిమాల్ని ఇష్టపడతారు. ఇక్కడ లార్జర్ దన్ లైఫ్ క్యారెక్టర్లంటే మక్కువ చూపుతారు. గత కొన్నేళ్లలో తెలుగు ప్రేక్షకుల అభిరుచి కొంచెం మారినప్పటికీ.. ఇంకా పూర్తి మార్పు అయితే రాలేదు. ఏమాయ చేసావె సినిమాకు తమిళంలో శాడ్ క్లైమాక్స్ పెట్టిన గౌతమ్ మీనన్.. తెలుగులోకి వచ్చేసరికి కథను సుఖాంతం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.

ఇప్పుడు మహేష్ బాబు కొత్త సినిమా ‘స్పైడర్’ విషయంలో మురుగదాస్ ఆలోచన కూడా ఇలాగే ఉందట. తెలుగు.. తమిళ ప్రేక్షకుల అభిరుచిలో కొంచెం మార్పు ఉండటంతో పాటు.. మహేష్ బాబు ఇక్కడ పెద్ద స్టార్ అయితే.. అక్కడి ప్రేక్షకులకు కొత్త కాబట్టి క్లైమాక్సును రెండు రకాలుగా తీయాలని మురుగదాస్ భావిస్తున్నాడట. సినిమా దాదాపుగా పూర్తి కావస్తున్న దశలో ఈ మేరకు స్క్రిప్టులో మార్పలు చేస్తున్నాడట మురుగ. తెలుగులో మహేష్ అభిమానుల్ని మురిపించేలా క్లైమాక్సులో కొంచెం హంగామా ఉంటుందట. హీరోజియం పాళ్లు అవీ ఎక్కువుంటాయట.

ఐతే తమిళంలో మాత్రం క్లైమాక్స్ రియలిస్టిగ్గా.. కొంచెం మామూలుగా ఉండేలా ప్లాన్ చేశాడట. క్లైమాక్స్ విషయంలోనే కాదు.. వేరే కొన్ని సన్నివేశాల విషయంలోనూ మురుగదాస్ ఇలాంటి మార్పులు చేసినట్లు సమాచారం. అందుకే ఈ చిత్ర షూటింగ్ సుదీర్ఘ కాలంగా నడుస్తోంది. క్లైమాక్స్ మార్పుల వల్ల షూటింగ్ మరింత లేటుగా ముగుస్తుందంటున్నారు. దాని వల్ల సినిమా రిలీజ్ డేట్ మారుతుందేమో అన్న ఆందోళన కూడా లేకపోలేదు.

,  ,  ,  ,  ,  ,