Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jan-2017 13:58:25
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం జనవరి 11న రిలీజ్ కానుందనే విషయం ఇప్పటికే అధికారికంగా ప్రకటించేశారు. ముందు డేట్ విషయంలో కన్ఫ్యూజన్ ఉన్నా.. ఆ గందరగోళం ఏంటో.. ఆ తర్వాత తీసుకున్న నిర్ణయం ఏంటో.. డీటైల్ట్ గా చెప్పాడు మెగాబ్రదర్ నాగబాబు.

అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. చరణ్ బాబు ఖైదీ నంబర్ 150 రిలీజ్ డేట్ 11న అని అనౌన్స్ చేశాడు. మొదట 12న అని అనుకున్నాం. కానీ క్రిష్ అండ్ బాలకృష్ణగారి కాంబినేషన్ లో వస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి 12న రిలీజ్ అని చెప్పగానే.. కొంచెం వెనక్కెళ్లి 11న రిలీజ్ చేయడం.. సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఒకే రోజున రెండు పెద్ద సినిమాలు రిలీజ్ చేసి.. అనవసరమైన పోటీని క్రియేట్ చేయకుండా ఒక మంచి వాతావావరణం ఉండేలా ప్రొడ్యూసర్ గా చరణ్ మంచి ఆలోచన చేశాడు. చరణ్ నిర్ణయంతో నాకు చాలా ఆనందం వేసింది. మొదటిసారి నిర్మాతగా సినిమా తీస్తున్నా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మంచి సంస్కారం చూపించాడు అంటూ విడుదల తేదీపై చెప్పాడు నాగబాబు.

ముందు రోజు ఖైదీ నంబర్ 150 రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. అన్ని సినిమాలు బాగా ఆడాలని చరణ్ కోరుకుంటాడు. ఇటు మా సినిమా అయినా.. అటు బాలకృష్ణ గారి సినిమా అయినా రెండూ బాగా ఆడాలని కోరుకుంటున్నాడు. అది నాకు ఇంకా సంతోషంగా ఉంది. అందరి సినిమాలు బాగా ఆడాలని కోరుకునే సంస్కారం చరణ్ బాబుకు ఉంది. మా అందరి ఉద్దేశ్యం కూడా అదే. హండ్రెడ్ పర్సెంట్ మా సినిమా బాగా ఆడాలి. బాలకృష్ణగారి సినిమా బాగా ఆడాలి. ఇండస్ట్రీ బాగు పడాలి. మొదటి సినిమాతో మంచి కల్చర్ ని ఇండస్ట్రీకి చూపించగలిగావు. ఖైదీ నంబర్ 150 సక్సెస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ క్రిష్. బాలకృష్ణగారి మూవీ వందో సినిమా బాగా ఆడుతుంది' అంటూ తన వీడియో సందేశాన్ని నాగేంద్రబాబు ముగించాడు.

ఈ వీడియోను పోస్ట్ చేసిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ.. రామ్ చరణ్ నిర్ణయానికి మద్దతునిచ్చిన నాగబాబుకు కృతజ్ఞతలు తెలిపింది.

,  ,  ,  ,  ,