Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Feb-2017 12:03:53
facebook Twitter Googleplus
Photo

ఏ ముహూర్తాన రిలీజ్ డేట్ ప్రకటించారోగానీ అప్పటినుండీ వరుసగా వాయిదాలు వేసుకుంటూ సినిమాను పోస్ట్ ఫోన్ చేసుకుంటున్నారు సింగం 3 మేకర్స్. అమ్మ మరణం - జల్లికట్టు - ప్రత్యేక హోదా నినాదం - ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఇలా కర్ణుడు చావుకు వంద కారణాలన్నట్టు సింగం 3 వాయిదాకు బోలెడు కారణాలు. ఎదుర్కొని సమర్ధవంతంగా రేపు రిలీజ్ కి యత్నిస్తున్నా కొన్ని సంఘటనలు చిత్ర బయ్యర్స్ ని భయపెడుతన్నాయి.

ఈ సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజా ఇటీవల జరిగిన ప్రచార కార్యక్రమంలో పైరసీని - పైరసీదారుల్ని ఏకిపడేశాడు. దీంతో ఇగో హార్ట్ అయిన టొరెంట్ యజమానులు ఏకంగా 9వ తారీఖున 11గంటలకు సినిమాను లైవ్ స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ఒక పెద్ద సినిమా మొదటి రోజే పైరసీ కాటుకు బలైతే - ఇదీ ఇన్నాళ్ల వాయిదాల తారువాత జరిగితే భారీ నష్టమనే చెప్పాలి.

ఇదికాక ప్రస్తుత తమిళనాట రాజకీయ పరిస్థితులు ఏమంత బాలేవు. ఏ క్షణంలోనైనా బంద్ లు ధర్నాలు జరిగే అవకాశాలు లేకపోలేదు. వాటన్నిటినీ పరిశీలిస్తే సింగానికి కష్టకాలమనే చెప్పాలి.

,  ,  ,  ,  ,