Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Nov-2016 14:01:51
facebook Twitter Googleplus
Photo

ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ఈరోటిక్ మూవీ గుంటూరు టాకీస్. ఈ చిత్రం సాధించిన సక్సెస్ లో హీరోయిన్ గా పరిచయమైన హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు చాలా కీలకం. కాన్సెప్ట్ ప్రకారం ఈ చిత్రానికి సీక్వెల్ తీసే అవకాశం ఉండడం.. ఇప్పటికే ప్రాజెక్టుకు క్రేజ్ ఉండడంతో.. గుంటూరు టాకీస్2 తీసేందుకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.

అయితే ఈ సినిమాలో సన్నీ లియోన్ ని హీరోయిన్ గా తీసుకుంటున్నారనే ప్రచారం జరిగింది. కానీ సన్నీ లియోన్ చేస్తున్నది రష్మీ చేసిన సువర్ణ పాత్ర కాదు. ఆమె రోల్ వేరేగా ఉంటుంది. అయితే.. రష్మీని సీక్వెల్ లో చేయమని అడిగితే.. ఆమె తన డిమాండ్ ను బేస్ చేసుకుని కోట్లలోనే రెమ్యూనరేషన్ అడుగుతోందట. దీంతో ఈ స్థానాన్ని పవన్ హీరోయిన్ నికీషా పటేల్ తో రీప్లేస్ చేశారట.సన్నీ లియోన్ పోషించనున్న స్పెషల్ రోల్ ఈమూవీకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

ఇప్పటిక ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైపోగా.. గుంటూరు టాకీస్ కి కొనసాగింపు గానే ఈ చిత్రం ఉండనుంది. కేరక్టర్లు కూడా మొత్తం అవే ఉండనుండగా.. కేవలం ఆర్టిస్టులు మాత్రమే మారతారట. అలా గుంటూరు టాకీస్2లో పల్లెటూరి అందాల భామ సువర్ణగా నికీషా పటేల్ టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తోంది.

,  ,  ,  ,  ,