Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Jun-2015 12:32:23
facebook Twitter Googleplus
Photo

ప్రేక్షకులకి కొత్తదనాన్ని అందించడం కోసం నాగార్జున ఎప్పుడూ తాపత్రయపడుతూ ఉంటాడనడానికి ఇప్పటివరకూ ఆయన చేసిన సినిమాలే నిదర్శనం. తాజాగా ఆయన చేస్తోన్న మరో సినిమా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఆ సినిమా పేరే 'సోగ్గాడే చిన్నినాయన'. ఈ సినిమా తాజా షెడ్యూలు ఈ నెల 26 నుంచి మైసూరులో ప్రారంభం కానుంది. కొన్నిరోజుల క్రితం ఇక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు కూడా అక్కడ మరికొన్ని సన్నివేశాలను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

రమ్యకృష్ణ .. లావణ్య త్రిపాఠి కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాలో, తాతగా .. మనవడిగా రెండు విభిన్నమైన పాత్రల్లో నాగార్జున కనిపించనున్నాడు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. కుటుంబ నేపథ్యం కలిగిన బలమైన కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం నాగ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

,  ,  ,  ,  ,