Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Jul-2017 12:28:07
facebook Twitter Googleplus
Photo

ఈ మధ్యన అరిపించారు అరుపులు అంటున్నాం. ఈలలు పెడబొబ్బులూ చప్పట్ల ప్లేసులో ఈ అరుపులు వచ్చేసింది. కాని తొలిసారి అరుపులు అనే పదానికి డిక్షనరీ మీనింగ్ ఏదైతే ఉందో.. అదే వాడాల్సి వస్తుందిప్పుడు. ఈ అరుపులు అభినందనలు ఎవరికంటే.. అండ్ ది అవార్డ్ గోస్ టు.. కృష్ణవంశీ నక్షత్రం.

ఆల్రెడీ టీజర్ పేరుతో చాలా పొడువాటి ట్రైలర్ ను ఒకసారి చూపించాడు కృష్ణవంశీ. సందీప్ కిషన్ అండ్ రెజీనా మెయిన్ లీడ్లో.. అలాగే సాయిధరమ్ తేజ్ అండ్ ప్రగ్యా జైస్వాల్ ముఖ్య పాత్రలలో.. ప్రకాష్ రాజ్ అండ్ శివాజీ రాజా వంటి టాలెంటెడ్ నటులు ఈ సినిమాలో ఉన్నారని అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ ట్రైలర్లో ప్రకాష్ రాజ్ తో మొదలెట్టి.. అందరూ అరుపులే అరుపులు. వద్దన్నా కూడా డైలాగులు అరుస్తూనే చెప్పినట్లున్నారు. డబ్బింగ్ లో ఇంకాస్త అరవడంతో.. మొత్తంగా అరుపులమయం అయిపోయింది. మధ్యలో కనిపించిన తనీష్ అసలు విలన్ గా సెట్టయ్యాడా అనే సందేహం వస్తుంది. ఓవరాల్ గా ట్రైలర్ ను చూసి కథ చెప్పమంటే.. పోలీస్ అవుదామనుకునే వాడు.. సర్టిఫికేట్లు పోవడంతో జాబ్ మిస్సవుతుంది.. అయినా కూడా పోలీస్ గా చేస్తుంటాడు. ఆ విధంగా అరిపించాడు కృష్ణవంశీ.

మొత్తంగా ట్రైలర్లో రెజీనా అండ్ ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ తప్పిస్తే.. మిగలినవన్నీ అరుపుల నక్షత్రాలే.

,  ,  ,  ,  ,