Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Oct-2015 14:11:18
facebook Twitter Googleplus
Photo

నాని- మణిరత్నం కలయికలో సినిమా ఉందా? లేదా? ప్రస్తుతం ఫిలింసర్కిల్స్ లో ఉన్న కన్ఫ్యూజన్ ఇది. నెలరోజుల క్రితమే ఈ క్రేజీ కాంబినేషన్ లో తెలుగు - తమిళ్ ద్విభాషా చిత్రం తెరకెక్కనుంది అన్న వార్తలొచ్చాయి. మలయాళ హీరో ఓకే బంగారం ఫేం దుల్కార్ సల్మాన్ స్థానంలో నానీని మణి రత్నం హీరోగా ఎంపిక చేసుకున్నారన్న వార్తలు వచ్చినప్పట్నుంచి టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ డిష్కసన్ సాగుతోంది. నాని ఫేవరెట్ డైరెక్టర్ మణిరత్నం. అతడి దర్శకత్వంలో నటించాలన్నది నా డ్రీమ్ అంటూ నాని పలుమార్లు చెప్పుకొచ్చాడు కాబట్టి ఈ కలయికలో సినిమా అనగానే జనాలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.

అయితే ఇటీవలి కాలంలో నానీ - మణిరత్నం సినిమా లేదన్న వాదనలు టాలీవుడ్ లో బలంగా వినిపిస్తున్నాయి. నాని ఈ సినిమాలో నటించడం లేదు. మణి సర్ వేరొక ప్రాజెక్టుతో బిజీ అయిపోయే ఆలోచనలో ఉన్నారు.. అన్న వార్తలొచ్చాయి. నిన్నటికి నిన్న ఈ విషయంపై విస్ర్తతంగా చర్చ సాగింది. కానీ ఇంతలోనే ఈ ప్రాజెక్టు నుంచి నాని తప్పుకోలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. మణిరత్నంతో పనిచేసే అవకాశాన్ని నాని వదులుకోవడం లేదు. అయితే ఈ ప్రాజెక్టు కాస్త ఆలస్యమవుతుంది అంతే. ఈ మల్టీస్టారర్ లో కార్తీ కూడా నటిస్తున్నాడు కాబట్టి అతడి కాల్షీట్ల సమస్య తలెత్తింది. అందుకే కొంతకాలం పాటు వేచి చూసే ఆలోచనలో ఉన్నారు. ప్రాజెక్టు ఉంటుంది. కానీ ఎప్పుడు ఉంటుంది? అన్నది చెప్పలేం అని నానికి సంబంధించిన అత్యంత సన్నిహితులు వ్యాఖ్యానించడం విశేషం. ఏదేమైనా నానీని ఓ సఖి - బొంబాయి రేంజు సినిమాలో చూడాలన్నది అభిమానుల ఆశ. ఆ ఆశ నెరవేరుతుందో? లేదో?

,  ,  ,