Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Oct-2017 11:50:18
facebook Twitter Googleplus
Photo

గుణం ఎంత ఉన్నా దానికి తగ్గట్టు వన్ పర్సెంట్ లక్ లేకుంటే ఎంత కష్ట పడినా వేస్ట్ అని చాలామంది అంటుంటారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కష్టంతో పాటు ఎక్కువగా లక్ నే నమ్ముకుంటారు. అందులో నాని ఒకడు. ఇతనికి లక్ ఎక్కడో లాక్ అయ్యి ఉందని ఇప్పటికి గమ్మత్తుగా కొన్ని కామెంట్స్ వినిపిస్తుంటాయి. నిజంగా నాని అదృష్టం ప్రస్తుతం చాలా పవర్ ఫుల్ గా ఉంది. ఏ సినిమా తీసినా మంచి విజయం దక్కుతోంది.

ముఖ్యంగా నాని.. అన్ని వర్గాల ప్రేక్షకుల మద్దతును అందుకుంటున్నాడు. ఇప్పటికి వరుసగా ఏడు విజయాలను అందుకున్న ఈ యువ హీరో ఈ ఏడాది రెండు సినిమాలతో విజయాల్ని అందుకున్నాడు. నేను లోకల్ - నిన్ను కోరి కెరీర్ లో నానికి మంచి మార్కెట్ సెట్ చేశాయనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే.. రచయిత కోన వెంకట్ నాని నిన్ను కోరి సినిమాలో గడ్డం లుక్ ఫోటోని పోస్ట్ చేస్తూ.. దాని గురించి వివరించారు. ‘‘నిన్నుకోరి’ సినిమా సెట్లో ప్రతిరోజు నానికి ఈ గడ్డం పెట్టడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టేది. సినిమా లొకేషన్ కి వచ్చిన వారందరు నానిని చూసి నిజంగా గడ్డం పెంచాడేమో అనుకునేవారు. అమెరికాకు చెందిన ఒక వ్యక్తి నానికి ఈ గడ్డం సెట్ చేసేవారు అని ట్వీట్ చేశారు.

ఇకపోతే ప్రస్తుతం నాని ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రంలో నటిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,