Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Dec-2016 12:39:08
facebook Twitter Googleplus
Photo

గౌతమీపుత్ర శాతకర్ణి పై ముందు నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. మొన్న ఆడియో వేడుకలో దర్శకుడు క్రిష్ మాటలు విన్నాక ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. తాజాగా నారా రోహిత్ మాటలు వింటుంటే.. సినిమాపై ఆసక్తి రెట్టింపవడం ఖాయం. పూర్తి సినిమా చూడలేదట కానీ.. గౌతమీపుత్ర శాతకర్ణి లో కొన్ని పోర్షన్స్ మాత్రం చూశాడట రోహిత్.

అవి చూశాక తనకు మాటలు రాలేదని.. ఫిదా అయిపోయానని అంటున్నాడు నారా వారి అబ్బాయి. ??2017లో మోస్ట్ అవైటెడ్ మూవీ అంటే ?గౌతమీపుత్ర శాతకర్ణి?నే. అదృష్టం కొద్దీ నేను ఈ సినిమాలో కొన్ని కీలకమైన పోర్షన్లు చూశా. అవి చూస్తే మాటలు రాలేదు. ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా?? అని నారా రోహిత్ చెప్పాడు.

బాలయ్యకు బంధువే కాక వ్యక్తిగతంగానూ సన్నిహితుడైన రోహిత్ ?గౌతమీపుత్ర శాతకర్ణి? ఆడియో వేడుకకు కూడా అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఓ దశలో బాలయ్య వందో సినిమాలో రోహిత్ ఓ క్యామియో రోల్ చేస్తాడన్న ప్రచారం కూడా జరిగింది. ఐతే మామూలు సినిమా అయితే రోహిత్ క్యారెక్టర్ చేసేవాడేమో కానీ.. చారిత్రక నేపథ్యమున్న సినిమా కావడంతో అందుకు అవకాశం లేకుండా పోయింది. భవిష్యత్తులో బాలయ్య-రోహిత్ కాంబినేషన్ చూసే అవకాశాన్ని కొట్టి పారేయలేం.

,  ,  ,  ,  ,  ,