Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Aug-2016 11:14:39
facebook Twitter Googleplus
Photo

కొద్దికాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తూ వస్తోన్న నారా రోహిత్ తాజాగా తన ఆశలన్నీ జ్యో అచ్యుతానంద అనే సినిమాపైనే పెట్టుకున్నారు. ?ఊహలు గుసగుసలాడే?తో దర్శకుడిగా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదలకు సిద్ధమైంది. నారా రోహిత్‌తో పాటు నాగ శౌర్య మరో హీరోగా నటించిన ఈ సినిమాలో రెజీనా హీరోయిన్‌గా నటించారు. సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న సందర్భంగా నారా రోహిత్‌తో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ..
ప్రశ్న) ?జ్యో అచ్యుతానంద? అంటూ మళ్ళీ ఓ రొమాంటిక్ కామెడీతో వచ్చేస్తున్నారు. ఎలా అనిపిస్తోంది?
స) చాలా బాగుంది. వరుసగా పరాజయాలు రావడంతో ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని రొమాంటిక్ కామెడీ జానర్‌తో వస్తున్నా. ఈ సినిమా నా కెరీర్‌కు తప్పకుండా మంచి ఉత్సాహాన్నిస్తుందన్న నమ్మకం ఉంది.
ప్రశ్న) కొద్దికాలంగా పూర్తిగా డిఫరెంట్ జానర్‌నే నమ్ముకున్నారు కదా.. ఇప్పుడు రెగ్యులర్ రొమాంటిక్ కామెడీ చేయడం ఎలా ఉంది?
స) నాకు మొదట్నుంచీ రొమాంటిక్ కామెడీలంటే చాలా ఇష్టం. ఈ కథ వినగానే చాలా రిఫ్రెషింగ్‌గా కనిపించింది. ఇద్దరు అన్నదమ్ములు ఒకే అమ్మాయిని ప్రేమించడం అన్న అంశం వినగానే బాగా కనెక్ట్ అయింది. నాకిష్టమైన జానర్ సినిమా చేయడం సరదాగా అనిపించింది.
ప్రశ్న) మీరు ఈ కథ విన్నపుడు మీతో పాటు నాగ శౌర్య మరో హీరోగా నటిస్తున్నారని తెలుసా?
స) తెలుసు. అప్పటికే నాగ శౌర్యను తన పాత్రకు కన్‌ఫర్మ్ చేశారు. కథ వినగానే ఎగ్జైట్ అయి ఒప్పుకున్నా. అయితే నాగ శౌర్యతో కలిసి చేయగలనా? కథరీత్యా ఆ రెండు పాత్రలూ చాలా న్యాచురల్ ఫ్రెండ్స్‌లా కనిపించాలి. అది సాధ్యమవుతుందా? అనిపించింది. ఎప్పుడైతే శౌర్యతో కలిసి స్క్రిప్ట్ డిస్కషన్‌లో పాల్గొన్నానో నా భయాలన్నీ పోయాయి. మేమిద్దరం ఈ సినిమా టైమ్‌లో మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. ఇద్దరం ఒకేలా ఆలోచిస్తూంటాం కూడా!
ప్రశ్న) హీరోయిన్‌గా రెజీనాను ఎవరు ఎంపిక చేశారు?
స) మొదట శ్రీనివాస్ ఈ సినిమాకు కొత్త అమ్మాయిని హీరోయిన్‌గా ఎంపిక చేద్దామనుకున్నారు. అయితే హీరోయిన్ పాత్రకు ఉన్న వెయిట్‌ను దృష్టిలో పెట్టుకొని అనుభవం ఉన్న నటి అయితే బాగుంటుందని అందరి సలహా మేరకు రెజీనాను ఎంపిక చేశాం.
ప్రశ్న) ?జ్యో అచ్యుతానంద?కు మేజర్ హైలైట్ అంటే ఏం చెబుతారు?
స) ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌నే ఈ సినిమాకు హైలైట్‌గా చెప్తా. అదేవిధంగా సినిమా అంతా సరదాగా, ఫీల్ గుడ్ సన్నివేశాలతో నడుస్తూంటుంది. యూత్ మా పాత్రల్లో తమని తాము ఐడెంటిఫై చేసుకుంటారు.
ప్రశ్న) ?జ్యో అచ్యుతానంద? లాంటి సినిమాల్లో క్లైమాక్స్ చాలా కీలకం. మరి ఈ సినిమాలో రెజీనా ప్రేమను ఎవరు గెలుచుకుంటారు?
స) (నవ్వుతూ..) ఆ విషయం మాత్రం మీరు సినిమాలో చూడాల్సిందే! శ్రీనివాస్ ఈ సినిమాకు అదిరిపోయే క్లైమాక్స్ రాశారు. ఈ స్క్రిప్ట్‌లో క్లైమాక్స్‌ని ఓ హైలైట్‌గా చెప్పుకోవచ్చు.
ప్రశ్న) ఈ సినిమాలో మీ రోల్ గురించి చెప్పండి?
స) ఈ సినిమాలో నేను రెండు ఏజ్ గ్రూప్‌ల్లో కనిపిస్తా. కాలేజీ స్టూడెంట్‌గా, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌గా రెండు షేడ్స్‌లో కనిపిస్తా. రెజీనా రాకతో ఇద్దరు అన్నదమ్ముల కథ ఎలాంటి మలుపులు తిరిగిందీ అన్న అంశం చుట్టూ సినిమా సాగుతుంది.
ప్రశ్న) చివరగా, దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌తో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
స) శ్రీనివాస్ అవసరాల బ్రిలియంట్ డైరెక్టర్. ప్రేక్షకులు ఏం కోరుకుంటారు? తాను అనుకున్న కథను ఎలా చెప్పాలి? అన్న అంశాలపై ఆయనకు మంచి క్లారిటీ ఉంది. ఇద్దరు అన్నదమ్ముల కథను ఇంత చక్కగా మలచడంలో ఆయన ప్రతిభను చూడొచ్చు. ఇక నిర్మాత సాయి కొర్రపాటి లాంటి స్ట్రాంగ్ మ్యాన్ మా వెనుక ఉండడంతో సినిమా అంతా సాఫీగా పూర్తైపోయింది.
ఇక అక్కడితో నారా రోహిత్‌తో మా ఇంటర్వ్యూ ముగుస్తూ, సినిమా మంచి విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపాం.

,  ,  ,  ,  ,