Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Sep-2017 11:19:50
facebook Twitter Googleplus
Photo

జై లవకుశ లో జూనియర్ ఎన్టీఆర్ రావణాసురుడిని తలపించే పాత్రను చేయబోతున్న సంగతి తెలిసిందే. అందులో జై పాత్ర రావణుడి స్ఫూర్తితో తీర్చిదిద్దుకున్న పాత్రే. ఈ సినిమా ప్రోమోల్లో కూడా ఆ విషయాన్ని ఇండికేట్ చేస్తున్నారు. ఐతే దాని కంటే ముందు వారం విడుదలవుతున్న కథలో రాజకుమారి లో నారా రోహిత్ క్యారెక్టర్ సైతం రావణాసురుడి పాత్ర స్ఫూర్తితో అల్లుకున్నదే అంటున్నాడు దర్శకుడు మహేష్ సూరపనేని.

ఈ సినిమాలో రోహిత్ దాదాపుగా విలన్ రోల్ చేస్తున్నట్లే అని అతను చెప్పాడు. ఈ పాత్రకు చాలా అవలక్షణాలు ఉంటాయని.. ఊరికే పైపైన నెగెటివ్ టచ్ ఉండటం కాకుండా పూర్తి స్థాయి విలన్ లాగా అతను ప్రవర్తిస్తాడని.. కథానాయికను నాశనం చేయాలని అతను చూస్తాడని.. చివరికి ఆ కథానాయిక వల్లే అతనెలా మారాడన్నది ఇందులో చూపించామని మహేష్ తెలిపాడు.

కథలో రాజకుమారి విడుదల అనివార్య కారణాల వల్ల ఆలస్యమైందని.. కానీ ఇప్పుడిది సరైన సమయంలోనే రిలీజవుతోందని భావిస్తున్నామని మహేష్ చెప్పాడు. ఈ సినిమా ఫలితంపై తనకెలాంటి టెన్షన్ లేదని.. ఔట్ పుట్ అంత బాగా వచ్చిందని అతనన్నాడు.

,  ,  ,  ,  ,