Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Jul-2017 13:15:30
facebook Twitter Googleplus
Photo

జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది డ్రగ్స్ విచారణ వ్యవహారం. స్కూలు పిల్లలు మొదలుకొని సినీ స్టార్స్ వరకూ డ్రగ్స్ రాకెట్ లో లింకులు ఉన్న వ్యవహారం ఇప్పుడు ఎంత హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలకు అధికారులు నోటీసులు ఇవ్వటం.. వారిలో కొందరు ఇప్పటికే సుదీర్ఘ విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

ఈ రోజు (సోమవారం) సిట్ విచారణకు హాజరయ్యేందుకు వచ్చారు టాలీవుడ్ నటుడు నవదీప్.

వెండితెర మీద హీరోగా.. విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన నవదీప్ బుల్లితెర మీద కూడా తనదైన ముద్రను వేశారు. పలు కార్యక్రమాలకు ప్రయోక్తగా వ్యవహరించారు. డ్రగ్స్ విచారణలో తీవ్ర ఆరపణలు ఎదుర్కొంటున్న నవదీప్ ఈ రోజు ఉదయం 10.20 గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చారు.

సిల్వర్ కలర్ పెద్ద కారులో తన తోటి మిత్రులతో కలిసి వచ్చిన నవదీప్.. సీరియస్ గా కార్యాలయానికి చేరుకున్నారు. గ్రే కలర్ ఫ్యాంట్.. వైట్ కలర్ షర్ట్ తో వచ్చిన నవదీప్.. తన షర్ట్ మొదటి బటన్ను వదిలేయటం.. ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేసుకున్న ఆయన.. తన కబ్స్ ను కాస్త మడటం కనిపించింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. సీరియస్ వదనంతో చకచకా లోపలికి వెళుతున్న ఆయన.. హటాతుత్తుగా రెండు చేతులు పైకెత్తి రాజకీయ నేత తరహాలో నమస్కారం పెట్టటం పలువురికి షాకింగ్ గా మారింది. తీవ్రమైన ఆరోపణలతో విచారణను ఎదుర్కొంటున్న నవదీప్.. విచారణకు వెళ్లే సమయంలో కాన్ఫిడెంట్ అన్న రీతిలో లోపలకు వెళ్లటం గమనార్హం. నవదీప్ బాడీ లాంగ్వేజ్ ను చూస్తే.. సిట్ విచారణను ఎదుర్కొనేందుకు వీలుగా ప్రిపేర్ అయి వచ్చినట్లుగా కనిపిస్తోందన్న అభిప్రాయం పలువురి నోట వినిపిస్తోంది. మరి.. లోపలకు వెళ్లేటప్పుడు కనిపించినంత కాన్ఫిడెంట్ గా బయటకు వచ్చేటప్పుడు ఉంటారా? అన్నది ప్రశ్నగా మారింది.

,  ,  ,  ,  ,