Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Sep-2015 10:48:03
facebook Twitter Googleplus
Photo

నల్లనయ్య విశాల్ సెలక్షన్ వెరీ వెరీ స్పెషల్. తన బాడీ లాంగ్వేజ్ కి మాట తీరుకి సరిపడే కథాంశాల్ని ఎంచుకుంటూ తెలివైన దారిలో వెళుతుంటాడు. పందెం కోడి నుంచి అతడిది అదే వరుస. యాక్షన్ జోనర్ లో రకరకాల ప్రయోగాల్ని చేస్తూ అందులోనే కొత్త దనాన్ని వెదుక్కుంటూ ఎప్పటికప్పుడు మసాలా సినిమాల్ని తెలుగు తమిళ ప్రేక్షకులకు అందిస్తున్నాడు. లింగుస్వామి - తిరు - బాల - హరి - సుశీంద్రన్ .. ఇలాంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్ల ను క్యూలో పెట్టి ఆట ఆడేస్తున్నాడు. అప్పడప్పుడు ఆట లో తడబాట్లు ఉన్నా మెజారిటీ భాగం అతడి తెలివి తేటలు వర్కవుటవుతూనే ఉన్నాయి.

విశాల్ నటించిన సినిమాలన్నీ మినిమం గ్యారెంటీ సినిమాలుగా నిలుస్తున్నాయి. కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్లు కొడుతూ తెలుగులో యావరేజ్ అనిపించు కున్నా అతడి బండి నల్లేరు మీద నడకలా సాగిపోతోంది. అప్పట్లో సుశీంద్రన్ దర్శకత్వంలో పాండ్యనాడు చిత్రంలో నటించాడు. తెలుగు లోనూ ఈ సినిమా ఫర్వాలేదనిపించింది. హరి దర్శకత్వంలో రిలీజైన పూజ (పూజై) కూడా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ కొట్టింది. ఇప్పుడు మరోసారి సుశీంద్రన్ దర్శకత్వంలోనే జయసూర్య (పాయుం పులి) చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఓ డీసెంట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. క్రిమినల్ అయిన అన్నకు పోలీస్ అయిన తమ్ముడి కి మధ్య ఎలుకా పిల్లి ఆట ఎలా ఉంటుందో అద్భుతం గా చూపించారీ సినిమా లో. పూర్తిగా మైండ్ గేమ్ పై నడిచే సినిమా ఇది.

అన్న రాజకీయ జీవితం కోసం ఎన్నో హత్యలు చేస్తుంటాడు. సిటీలో ని బిజినెస్ సర్కిల్ ని డబ్బు కోసం వేధిస్తూ హత్యలు చేస్తుంటాడు. పోలీస్ కమిషనర్ అయిన హీరో అసలు ఇవన్నీ చేస్తోంది ఎవరు? అన్నది కనిపెట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ దుర్మార్గాలు చేసేది రౌడీలు గూండాలు కాదు. మామూలు మనుషుల్లో మాములు కుటుంబాల్లోనే ఉంటూ అసాధారణమైన దుర్మార్గాలు చేసే కిలాడీలు. తెలివైన ఎత్తుగడలతో స్లీపర్సెల్ యాక్టివిటీస్ చేస్తుంటారు. అందువల్ల అది కనిపెట్టడం చాలా కష్టం. చివరి నిమిషంలో ఇన్ని హత్యలు చేసింది చేయించింది తన అన్నే రాజకీయం కో్సం తండ్రినే హత్య చేయబోయింది తన అన్నే అని తెలిసిపోతుంది. ఆ తర్వాత ఓ పోలీస్ అధికారిగా హీరో ఏం చేశాడన్నది తెరపైనే చూడాలి. ఈరోజు రిలీజైన సినిమాల్లో ఇదో చక్కని చిత్రంగా పేరు తెచ్చకుంది. ఫలితం తేలాలంటే వీకెండ్ ముగియాలి.

,  ,  ,  ,