Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-May-2015 11:44:34
facebook Twitter Googleplus
Photo

వయసు పెరుగుతున్నా వన్నె తరగని అందాలతో వెండితెరపై రాణిస్తున్న నయనతార త్వరలో సూపర్ స్టార్ రజనీకాంత్ తో జతకట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 'లింగా' సినిమా తర్వాత రజనీ తన తదుపరి చిత్రాన్ని రంజిత్ దర్శకత్వంలో చేయడానికి అంగీకరించిన సంగతి విదితమే. లైకా ప్రొడక్షన్, ఈరోస్ ఎంటర్ టైన్మెంట్స్ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో కథానాయికగా నయనతారను ఎంపిక చేశారన్నది కోలీవుడ్ తాజా సమాచారం. గతంలో ఈ ముద్దుగుమ్మ 'చంద్రముఖి', 'కుచేలన్' (తెలుగులో కథానాయకుడు) సినిమాలలో ఈ సూపర్ స్టార్ తో కలసి నటించింది.

,  ,  ,  ,  ,  ,