Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Apr-2017 11:31:24
facebook Twitter Googleplus
Photo

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతారను ఉద్దేశించి తమిళ సీనియర్ నటుడు.. రచయిత వేలా రామమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నయనతార అమ్మాయి కాదని.. మగాడు అని ఆయన వ్యాఖ్యానించారు. ఐతే ఈ వ్యాఖ్యలు ఆమెను కించపరచడానికి చేసినవి కాదు. నయనతారది సగటు మహిళల్లాగా భయపడే మనస్తత్వం కాదని.. ఆమె మగాళ్లలాగా ధైర్యంగా ఏ విషయాన్నయినా డీల్ చేస్తుందని రామమూర్తి అన్నారు. ముందు రచయితగా మంచి పేరు సంపాదించి.. ఆ తర్వాత నటనలోకి ప్రవేశించి అందులోనూ తనదైన ముద్ర వేసిన వేలా రామమూర్తి నయన్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరమే.

నాకు హీరోయిన్లలో నయనతార అంటే చాలా ఇష్టం. ఆమెలో చాలా గొప్ప లక్షణాలున్నాయి. మగాళ్లలా చాలా ధైర్యంగా ఉంటుంది. వేష ధారణలోనే కాదు.. మానసిక దృఢ చిత్తంలోనూ ఆమెకు తిరుగులేదు. ఆలోచనల్లో స్థిరత్వంతో పాటు.. మహిళా వాదిగా ఆమె ఎంతో ఉన్నత స్థానంలో ఉంది. ఆమెను ఓ మహిళ అని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఆమెలో ఒక మగాడిలో ఉండే ఆధిపత్య ధోరణి.. ఆకర్షణ ఉన్నాయి. నయనతార గొప్ప ఆర్టిస్టు కూడా’’ అని వేలా రామమూర్తి అన్నారు. ఈ మాటలు మరీ అతిశయోక్తి ఏమీ కాదు. నిజంగా ఈ తరం హీరోయిన్లలో చాలా భిన్నంగా కనిపిస్తుంది నయన్. ఆమె యాటిట్యూడ్ మరెవరికీ సాధ్యం కానిది.

,  ,  ,  ,