Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Apr-2015 10:08:38
facebook Twitter Googleplus
Photo

రజనీకాంత్ అంటే విలక్షణమైన అభినయం ... రజనీకాంత్ అంటే విరామమెరుగని విజయం. అలాంటి రజనీతో ఇటీవల విజయం దోబూచులాడుతోంది. సాధ్యమైనంత త్వరగా ఆయన దానిని వెతికి పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే శంకర్ తో చర్చలు జరుపుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో విలన్ .. విక్రమ్ అనే వార్త బయటికి వచ్చింది. ఈమధ్య శంకర్ నిర్మించిన 'ఐ' సినిమా కూడా ఆయనకి నిరాశే మిగిల్చింది. దాంతో ఆయనకీ ఈ విజయం చాలా ముఖ్యమైనదే.

అయితే రజనీకాంత్ హీరోగా చేయనున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో విలన్ గా కమల్ హాసన్ ని నటింపజేసే ప్రయత్నం జరుగుతున్నట్టు వార్తలు షికారు చేశాయి. ఇక కథ ఏదైనా .. కథనం ఏదైనా హిట్ కొట్టడం ఖాయమని అంతా అనుకున్నారు. ఎందుకంటే ఈ ఇద్దరినీ ఒకే కథలో .. ఒకే తెరపై చూడాలని ఆశపడుతోన్న అభిమానులు ఎంతోమంది వున్నారు. ఏం జరిగిందో తెలియదుగానీ .. ప్రస్తుతం విలన్ గా విక్రమ్ పేరు మాత్రం వినిపిస్తోంది. విభిన్నమైన పాత్రల పట్ల ఉత్సాహాన్ని ప్రదర్శించే విక్రమ్ .. విలన్ గా రజనీతో తెరపై తలపడటానికి సంసిద్ధతను వ్యక్తం చేశాడని అంటున్నారు.

,  ,  ,  ,  ,