Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Nov-2016 15:23:55
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ సినిమాల్లోకి వచ్చాడు పవన్ కళ్యాణ్. కొన్ని సినిమాల్లో చిరంజీవిని ఇమిటేట్ చేసే ప్రయత్నం కూడా చేశాడు. ఐతే చిరంజీవి.. పవన్ ను ఇమిటేట్ చేయడం ఎప్పుడైనా చూశారా..? అలాంటి విషయం ఎప్పుడైనా విన్నారా..? ఐతే పవన్ సినిమాల్లోకి రాకముందే అతణ్ని చిరంజీవి ఇమిటేట్ చేశాడట. ఆ ఇమిటేషన్ గురించి పవన్ కళ్యాణ్ కు నటన నేర్పించిన గురువు వైజాగ్ సత్యానంద్ వెల్లడించాడు. పవన్ తో తన ప్రయాణం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పాడు సత్యానంద్.

??చిరంజీవి గారు నటించిన ?మంచు పల్లకి? సినిమాకు నేను పని చేశాను. ఆ సమయంలో ఆయన నన్ను గమనించారు. నేను కొత్త వాళ్లను ట్రైన్ చేసుకుని నాటకాలు వేస్తానని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుంచుకుని తొమ్మిదేళ్ల తర్వాత కళ్యాణ్ ను నాకు అప్పగించారు. ఐతే కళ్యాణ్ మీద వాళ్ల ఇంట్లో వాళ్లెవ్వరికీ నమ్మకం లేదు. జనాలతో కలవడు.. రిజర్వ్డ్ గా ఉంటాడు కాబట్టి అతను నటనలో సక్సెస్ కాడని అనుకున్నారు. ఐతే చిరంజీవి గారికి మాత్రం కొంచెం నమ్మకం ఉండేది. ఎందుకంటే ఏదైనా పని చెబితే శ్రద్ధగా చేస్తాడని ఆయనకు భరోసా. కళ్యాణ్ ను నాకు అప్పగించేటపుడు చిరంజీవి.. అతణ్ని ఇమిటేట్ చేసి చూపించాడు. ?ఎక్కడికి వెళ్లొచ్చావ్? అని అడిగితే.. ఎలా తల గోక్కుంటాడో.. ఎలా తల వంచుకుని కళ్ల్లల్లోకి చూడకుండా మాట్లాడతాడో ఇమిటేట్ చేసి చూపించాడు. ముందు చెన్నైలో నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చాను. తర్వాత గ్రూప్ ట్రైనింగ్ అవసరమని వైజాగ్ తీసుకెళ్తానని చెబితే.. మీ ఇష్టం వచ్చినట్లు చెయ్యండన్నారు. వైజాగ్ లో రెండు నెలల పాటు నా థియేటర్ గ్రూప్ వాళ్లతో కలిసి ట్రైనింగ్ ఇచ్చాను. కళ్యాణే నా తొలి విద్యార్థి. అతడి కోసమే 40 చాప్టర్ల సిలబస్ తయారు చేశాను. 3 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చాను. అంతా బాగా జరిగింది?? అని సత్యానంద్ వెల్లడించాడు.

,  ,  ,  ,