Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Sep-2016 11:34:04
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టుల్లో మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ?ఖైదీ నెం.150? మొదటి స్థానంలో ఉంది. సినిమా అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి సినిమా గురించిన కొత్త విశేషాలేమన్నా బయటకి వస్తాయేమోనని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అలాంటి వార్తే ఒకటి ఫిలిం నగర్లో చెక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఎవరూ ఊహించని వ్యక్తి ఒకరు నటించబోతున్నారట. ఆ వ్యక్తి మరెవరో కాదు మెగా డాటర్, నాగబాబు కుమార్తె నిహారిక అని అంటున్నారు..
?ఒక మనసు? చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన ఈమె చిరు 150వ చిత్రంలో ఓ చిన్న అతిధి పాత్రలో కనిపించబోతోందట. మామూలుగా మెగా ఫ్యామిలీ నటులు ఒకరి సినిమాల్లో ఒకరు నటించడం పాత విషయమే. అయితే ఎవరూ ఊహించని విధంగా నిహారిక చిరు సినిమాలో కనిపించబోతోందన్న వార్త బయటకు రాగానే అభిమానుల్లో ఆసక్తి కాస్త ఎక్కువైంది. కానీ ఈ విషయంపై ఇంకా మెగా క్యాంప్ నుండి ఎలాంటి సమాచారమూ అందలేదు.

,  ,  ,  ,  ,  ,  ,  ,