Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Nov-2017 11:45:56
facebook Twitter Googleplus
Photo

రెండు సక్సెస్ ఫుల్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి తన బ్యూటీతో మంచి గుర్తింపే తెచ్చుకుంది సురభి. యంగ్ హీరోల్లో శర్వానంద్ తో ఎక్స్ ప్రెస్ రాజా.. నానితో జెంటిల్ మెన్ సినిమాల్లో నటించి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ముచ్చటగా మెగా ఫ్యామిలోని యంగ్ హీరో అల్లు శిరీష్ పక్కన నటిస్తున్న సినిమా ద్వారా హ్యాట్రిక్ కొట్టాలని ఆశపడుతోంది.

ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేం డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో శిరీష్ హీరోగా చేస్తున్న సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ ఒక్క క్షణంలో సురభియే హీరోయిన్. అల్లు శిరీష్ తో కలిసి పనిచేయడం అంటే టోటల్లీ ఫన్ గా ఉంటుందని అంటోంది ఢిల్లీ సొగసరి. ‘‘శిరీష్ తో షూటింగ్ చాలా హ్యాపీగా సాగింది. ప్రాక్టికల్ జోక్స్ బాగా వేస్తాడు. ఒకోసారి అతడు జోక్ చేస్తున్న విషయం కూడా గమనించలేం. ఆ విషయంలో అతడు సూపర్’’ అంటూ సర్టిఫికెట్ ఇస్తోంది సురభి. ఒక్కక్షణం సినిమాలో తనది ఆర్టిస్టిక్ టచ్ ఉన్న పాత్ర అని చెబుతోంది. ఈ సినిమాలో కొత్త లుక్ తో కనిపించాలన్న తపనతో ప్రత్యేకంగా ఫొటో షూట్స్ కూడా చేశానని.. వాటిలో ది బెస్ట్ అనుకున్న లుక్ తో సినిమాలో కనిపించబోతున్నాను అంటోంది.

ఒక్క క్షణం మూవీ డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ పర్ ఫెక్షనిస్ట్ అంటోంది సురభి. ఆయన గుడ్ యాక్టర్. సీన్ లో యాక్టర్ల నుంచి తనకు కావాల్సిన నటుల నుంచి బెస్ట్ రాబట్టుకోవడానికి స్వయంగా నటించి చూసిస్తారని.. అందుకే ఆయనను గురువు అనే పిలుస్తానని చెబుతోంది. అల్లు శిరీష్ - సురభి ఇద్దరికీ హిట్లయితే వచ్చాయి కానీ వాళ్ల నటన మాత్రం గొప్పగా ఉందని ఇంతవరకు పేరు రాలేదు.

,  ,  ,  ,  ,