Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Jul-2016 11:23:30
facebook Twitter Googleplus
Photo

నటి నిక్కీగల్రాణిని నెరజాణ అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. అవకాశాలను ఎలా రాబట్టుకోవాలో తెలిసిన నటి అని కూడా అంటున్నారు. సంగీతదర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమారుకు జంటగా డార్లింగ్ చిత్రం ద్వారా తమిళ చిత్రపరిశ్రమకు పరిచయమైన నటి నిక్కీగల్రాణి. మంచి సక్సెస్‌తో ఇక్కడ తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ బ్యూటీ వరుసగా అవకాశాలు రాబట్టుకుంటూ బిజీగా ఉన్నారు. నిక్కీగల్రాణి నటించిన కో-2.ఈ మధ్య తెరపైకి వచ్చిన వేలైన్ను వందుట్టా వెల్లైక్కారన్ చిత్రాలు మంచి ప్రజాదరణను పొందడంతో ఈమెకు డిమాండ్ బాగా పెరిగింది. అందాలారబోతకు నో చెప్పకపోవడంతో పలు అవకాశాలు తలుపుతడుతున్నాయి. ప్రస్తుతం లారెన్స్‌కు జంటగా నటించిన మొట్టశివ కెట్టశివ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.


తాజాగా విక్రమ్‌ప్రభుతో నెరుప్పుడా చిత్రంలో నటిస్తున్నారు. మరిన్ని అవకాశాలు తన కోసం ఎదురు చూస్తున్నాయంటున్న నిక్కీగల్రాణి అవకాశాలు రాబట్టుకోవడానికి వాడుకుంటున్న టెక్నిక్ ఏమిటో తెలుసా?ి సనీ ప్రముఖులతో చక్కని రిలేషన్ షిప్‌ను మెయింటెయిన్ చేయడమే. ముఖ్యంగా హీరోలతో ఫ్రెండ్లీగా ఉంటున్నారట. వారు నటించిన చిత్రాలు చూసి వెంటనే ఫోన్ చేసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారట. ఇలా దర్శకులను వదలడం లేదట. నిక్కీగల్రాణి స్నేహ తత్వానికి, ఆమె అభినందనలకు పొంగిపోతున్న నటులు, దర్శకుల నుంచి అవకాశాలను రాబట్టుకుంటున్నారట. నిక్రీ నిజంగానే నెరజాణ కదూ?

,  ,  ,  ,  ,