Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Jul-2017 10:39:41
facebook Twitter Googleplus
Photo

ఈసారికి వసూళ్ల మోత కష్టమే అనుకున్నారు నాని కొత్త సినిమా నిన్ను కోరి విషయంలో. కానీ ఇలాంటి సినిమాతో కూడా అదిరిపోయే వసూళ్లు రాబడుతున్నాడు నాని. తొలి వారాంతంలోనే రూ.16 కోట్ల దాకా షేర్ సాధించిన ఈ సినిమా.. సెకండ్ వీకెండ్ అయ్యేసరికి రూ.25 కోట్ల షేర్ మార్కును దాటేయడం విశేషం. తొలి పది రోజుల్లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ.25.25 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం. గ్రాస్ రూ.46 కోట్లు దాటింది. ఫుల్ రన్లో ఈ చిత్ర షేర్ రూ.35 కోట్లకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టయిన ‘నేను లోకల్’ కూడా అంతే షేర్ వసూలు చేసింది.

తొలి పది రోజుల్లో ఏరియాల వారీగా ‘నిన్ను కోరి’ షేర్స్ వివరాలు..

నైజాం-రూ.8.32 కోట్లు

వైజాగ్ (ఉత్తరాంధ్ర)-రూ.2.81 కోట్లు

సీడెడ్ (రాయలసీమ)-రూ.2.44 కోట్లు

తూర్పు గోదావరి-రూ.1.65 కోట్లు

పశ్చిమగోదావరి-రూ.1.07 కోట్లు

గుంటూరు-రూ.1.34 కోట్లు

కృష్ణా- రూ.1.37 కోట్లు

నెల్లూరు-రూ.55 లక్షలు

ఏపీ-తెలంగాణ షేర్- రూ.19.55 కోట్లు

యుఎస్- రూ.3.24 కోట్లు

కర్ణాటక-రూ.1.61 కోట్లు

మిగతా ఏరియాల్లో- రూ.85 లక్షలు

వరల్డ్ వైడ్ షేర్- రూ.25.25 కోట్లు

వరల్డ్ వైడ్ గ్రాస్- రూ.46.1 కోట్లు

,  ,  ,  ,  ,