Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Apr-2016 11:17:49
facebook Twitter Googleplus
Photo

కొందరు దర్శకులకు మ్యూజిక్ మీద మంచి టేస్టుంటుంది. అలాంటి డైరెక్టర్ల సినిమాల ఆడియోల కోసం జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తారు. త్రివిక్రమ్ అలాంటి దర్శకుల్లో ఒకడు. త్రివిక్రమ్ ఇప్పటిదాకా చేసిన ప్రతి సినిమా ఆడియో హిట్టయింది. కోటి.. మణిశర్మ.. దేవిశ్రీ ప్రసాద్.. ఇలా ఏ సంగీత దర్శకుడితో పని చేసినా.. మంచి పాటలే రాబట్టుకున్నాడు త్రివిక్రమ్. ఐతే గత కొన్నేళ్లుగా వరుసగా దేవిశ్రీతోనే పని చేస్తున్న త్రివిక్రమ్ ఈసారి మాత్రం వెరైటీగా మిక్కీ జే మేయర్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నాడు. మరి వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ?అ..ఆ? పాటలు ఎలా ఉంటాయో వినాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సంగీత ప్రియులు. వారి నిరీక్షణకు త్వరలోనే తెరపడబోతోంది.

ఈ నెల 26న ?అ..ఆ? ఆడియో హైదరాబాద్ లో విడుదల కాబోతోంది. ?అ..ఆ? సంగీత ప్రాధాన్యం ఉన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ కావడంతో దీని ఆడియో మీద అందరి దృష్టి నిలిచి ఉంది. త్రివిక్రమ్ లాంటి పెద్ద దర్శకుడితో చేస్తున్న మిక్కీ.. ఈ అవకాశాన్ని ఎంత మేరకు సద్వినియోగం చేసుకున్నాడో.. ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడో చూడాలి. నితిన్-సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సన్నాఫ్ సత్యమూర్తి?తో కొంచెం వెనుకబడ్డ త్రివిక్రమ్. ?అ..ఆ?తో మళ్లీ తనేంటో రుజువు చేసుకోవాలని చూస్తున్నారు. హారిక-హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

,  ,  ,  ,  ,  ,