సౌతిండియన్ సినిమాలో నటి నిత్యా మీనన్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళ, మళయాల భాషల్లో అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకున్న నిత్యా, ఈమధ్యే వచ్చిన జనతా గ్యారెజ్, ఇంకొక్కడు సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు. ఇక తాజాగా ఆమె వెంకటేష్‌తో చేయబోయే ఓ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో నిత్యా మీనన్ గతంలో ఎప్పుడూ కనిపించనంత కొత్తగా కనిపిస్తారట. ఈ పాత్ర కోసమే ఆమె బరువు కూడా తగ్గుతున్నారట.
ఇక ఈ సరికొత్త లుక్‌తో ఆమె అభిమానులను ఆశ్చర్యపరచేందుకు సిద్ధమయ్యారనే తెలుస్తోంది. నేను శైలజ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కిషోర్ తిరుమల, వెంకీ-నిత్యా మీనన్ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఒక మధ్య వయస్కుడైన వ్యక్తి, ఓ యువతికి మధ్యన జరిగే సరికొత్త ప్రేమకథతో ఈ కామెడీ తెరకెక్కనుందని సమాచారం.