Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Apr-2016 11:23:50
facebook Twitter Googleplus
Photo

తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా త్రివిక్రమ్ స్థానమేంటో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మాటల మ్యాజిక్‌తో కట్టిపడేసే ఈ దర్శకుడు, తాజాగా ?అ..ఆ..? అన్న ఆసక్తికర టైటిల్‌తో ఓ రొమాంటిక్ కామెడీని మనముందుకు తెస్తున్నారు. నితిన్, సమంతలు హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాపై ఫస్ట్‌లుక్ రిలీజ్ అయినప్పట్నుంచే మంచి అంచనాలుండగా, ఈమధ్యే విడుదలైన టీజర్ ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఇక ఈ నేపథ్యంలోనే అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపేలా టీమ్ ఆడియో రిలీజ్ తేదీని ప్రకటించేసింది.
ఏప్రిల్ 26న ?అ..ఆ..? ఆడియోను రిలీజ్ చేయనున్నట్లు టీమ్ స్పష్టం చేసింది. మిక్కీ జే మేయర్ అందించిన మ్యూజిక్‌తో పాటు అదే రోజు థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదల కానుంది. ?అ..ఆ..? అంటే అనసూయ రామలింగం, ఆనంద్ విహారి అన్న ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే ప్రేమకథని టీజర్ ద్వారా స్పష్టమైపోయింది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా మే నెలలో విడుదల కానుంది.

,  ,  ,  ,  ,  ,  ,