Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Apr-2016 13:36:36
facebook Twitter Googleplus
Photo

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటికి 25 సినిమాలు చేసేశాడు. సుకుమార్ డైరెక్షన్ లో చేసిన 25వ చిత్రంతో తొలిసారిగా 50కోట్ల షేర్ ను రాబట్టి.. రికార్డ్ సృష్టించాడు జూనియర్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ మూవీ చేస్తున్నాడు. గత కొన్నేళ్లుగా సీనియర్ - ట్యాలెంటెడ్ దర్శకులుగా ప్రూవ్ చేసుకున్నవారితోనే సినిమాలు చేస్తున్న జూనియర్.. ఇప్పుడు ట్రెండ్ మార్చేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.

జనతా గ్యారేజ్ తర్వాత వక్కంత వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్నాడు యంగ్ టైగర్. వంశీతోపాటు మరి కొందరు కొత్త డైరెక్టర్లు చెప్పిన కథలు కూడా వింటున్నాడట. యంగ్ ట్యాలెంట్ ని ప్రోత్సహించాలని గట్టిగా డిసైడ్ అయ్యాడని అంటున్నారు. కొన్నేళ్లుగా ప్రూవ్డ్ డైరెక్టర్లతో చేయడంతో ఎన్టీఆర్ గురించి ఇలా చెప్పాల్సి వస్తోంది కానీ.. మొదట్లో ఇలా కొత్త ట్యాలెంట్ ని ప్రోత్సహించేందుకు జూనియర్ బాగానే ప్రయత్నించాడు.

2001లో వచ్చిన ఎన్టీఆర్ మూవీ సుబ్బు.. కొత్త దర్శకుడు సురేష్ వర్మ తీసినదే. ఆ తర్వాత 2003లో డీకే సురేష్ దర్శకత్వంలో నాగ అనే చిత్రం చేశాడు ఎన్టీఆర్. 2005లో వచ్చిన నా అల్లుడు కూడా వర ముళ్లపూడికి మొదటి సినిమానే. ఇవేవీ సక్సెస్ ను ఇవ్వలేకపోవడంతో.. ఆ తర్వాత న్యూ ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేయడం మానేసిన ఎన్టీఆర్.. ఇన్నేళ్లకి మళ్లీ ఆ రూట్ లోకి వచ్చాడు.

,  ,  ,  ,  ,  ,