Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Apr-2016 11:55:59
facebook Twitter Googleplus
Photo

పెద్ద స్థాయి తెలుగు సినిమాల్లో తెలంగాణ పదాలు.. పద్యాలు.. జానపదాలకు చోటు కల్పించి వాటికి ప్రచారం కల్పించిన ఏకైక హీరో తానొక్కడినే అని గర్వంగా ప్రకటించుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కావాలంటే తాను చేసిన సినిమాలన్నీ చూసుకోవచ్చని.. దశాబ్దం కిందట వచ్చిన ?జానీ? సినిమాలోనే తెలంగాణ జానపదాలు వినిపిస్తాయని.. ఇంకా తన ప్రతి సినిమాలోనూ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే అంశాలకు చోటిచ్చానని పవన్ చెప్పాడు. ఈ విషయంలో తనకు ఆయా సినిమాల యూనిట్ సభ్యుల నుంచి అభ్యంతరాలు వచ్చినా పట్టించుకోలేదని పవన్ చెప్పాడు.

??ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ మధ్య కల్చరల్ డిఫరెన్సెస్ చాలా ఉంటాయి. ఈ విషయాన్ని నేను ఎప్పుడో అర్థం చేసుకున్నా. నా తెలంగాణ స్నేహితుల భాష.. యాస అన్నీ వేరుగా ఉండేవి. కానీ తెలంగాణకు ఒకప్పుడు తెలుగు సినిమాల్లో రిప్రెజెంటేషన్ ఉండేది కాదు. మిగతా వాళ్లు గుర్తించారో లేదో కానీ.. నేను చాలా ఏళ్ల కిందటే ఈ విషయాన్ని గుర్తించి.. తెలంగాణ రెప్రజెంటేషన్ ఉండాలని కాన్షియస్ ఎఫర్ట్ పెట్టాను. నా సినిమాల్లో ఇక్కడి జానపదాలకు.. పాటలకు.. మాటలకు ప్రాతినిధ్యం కల్పించాను. కొంతమంది ఇలాంటివి పెడితే ఆంధ్రా వాళ్లకు కనెక్టవ్వవు.. అర్థం కావు.. అనేవాళ్లు. నేను పర్వాలేదని ఉంచమనేవాణ్ని. అక్కడి పాటలు మాత్రం ఇక్కడి వాళ్లు ఎలా అర్థం చేసుకుంటారు అని అడిగేవాడిని.

అసలు కళకు సంబంధించి అన్ని చోట్లా కనెక్టవ్వవు అనేది ఏముంది? మనం వేరే భాషల సినిమాలే చూస్తున్నుడు దీనికేముంది? కళ అనేది కల్చరల్ బ్రిడ్జ్ లాంటిది. జనాల మధ్య వారధిగా నిలవాలి. దానికి ఎంతో బాధ్యత ఉంది. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న కల్చరల్ గ్యాప్ ను నేను పూడ్చాలని అనుకున్నాను. అందుకే నా సినిమాల్లో తెలంగాణ కల్చర్ తేవడానికి ట్రై చేశాను?? అని పవన్ చెప్పాడు.

,  ,  ,  ,  ,  ,  ,  ,  ,