Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Oct-2017 12:20:16
facebook Twitter Googleplus
Photo

హీరోలు సినిమాల షూటింగ్ ను పూర్తి చెయ్యగానే చిత్ర ప్రమోషన్స్ లో చాలా చురుగ్గా పాల్గొంటారు. ఈ రోజుల్లో సినిమాకు కావాల్సింది మెయిన్ ప్రమోషన్సే. ఎదో ఒక విధంగా సినిమాను జనాల వరకు తీసుకెళ్లాలి. అందుకే తారలు సోషల్ మీడియా ద్వారా కూడా ఎక్కువగా ప్రమోషనన్స్ చేస్తున్నారు. అయితే ఈ మధ్యన ఒక హీరో మాత్రం తన సినిమాకు చాలా దూరంగా ఉంటున్నాడు. అతను ఎవరో కాదు టాలీవుడ్ లో మొదట విలన్ గా చేసి ఆ తర్వాత హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో గోపిచంద్.

యాక్షన్ హీరో లక్షణాలు ఉన్నా కెరీర్ లో ఇంకా ఒక భారీ హిట్ ను అందుకోలేక సతమతమవుతున్నాడు ఈ హీరో. దానికి తోడు ఆయన సినిమాలు మధ్యలో ఆగిపోతుండడం కెరీర్ కి పెద్ద మైనస్ గా మారుతోంది. జ్యోతి కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆక్సిజన్ సినిమా గత ఏడాది ఎపుడో మొదలయ్యింది. అయితే దర్శకుడికి గోపీకి ఆ మధ్యలో విభేదాలు రావడంతో సినిమాకి బ్రేకులు బాగానే పడ్డాయని వార్తలు వచ్చాయి. అదే విధంగా గౌతమ్ నంద సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు ఆ సినిమా గురించి అడిగితే తనకు తెలియదు అన్నట్లు గానే స్పందించాడు గోపి. ఇక మొత్తానికి ఆక్సిజన్ రిలీజ్ కు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. కుదిరితే ఈ నెల చివర్లోనే సినిమాను రిలీజ్ చేయడానికి సన్నహకలు చేస్తున్నారు. అయితే సినిమా ఆడియో వేడుకను ఈ నెల 15న నెల్లూరులో ప్లాన్ చేశారు. దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి ఈ సినిమా గురించి ఇంతవరకు స్పందించని గోపిచంద్ ఆడియో వేడుకకు వస్తాడా? లేదా ? అన్నది డౌట్ గానే ఉంది. చూడాలి మరి గోపి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో..

ఇక గోపిచంద్ మూడు నెలల క్రితం రిలీజ్ చేసిన గౌతమ్ నంద అపజయాన్నే ఇచ్చింది. అంతకుముందు బి గోపాల్ డైరెక్షన్ లో ఎప్పుడో స్టార్ట్ అయ్యి మరెప్పుడో ఎండ్ అయిన ఆరడుగుల బుల్లెట్ కూడా విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు ఆక్సిజన్ పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంది.

,  ,  ,  ,  ,  ,