Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Jun-2017 10:55:02
facebook Twitter Googleplus
Photo

ఈ ఏడాది వస్తున్న సినిమాలలో మైండ్ బ్లాక్ అయ్యే కాంబినేషన్లలో పూరీ జగన్నాథ్ - బాలకృష్ణ పైసా వసూల్ ఒకటి. ఇప్పటికే సినిమా టైటిల్ బాలయ్య ఫోజ్ మంచి టాక్ వచ్చేలా చేసింది. బాలయ్య లాంటి మాస్ హీరో పోకిరి స్టైల్ డైరక్షన్లో నటిస్తే ఎలా ఉండబోతుందో చూడ్డానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా నిర్మాణం కూడా భారీగానే ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ సినిమాను కొనడానికి పైసలు పెట్టడానికి డిస్ర్టిబ్యూటర్లు భయపడుతున్నారట.

బాలయ్య సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి ఉన్న మార్కెట్ 40 కోట్లు. కానీ యూఎస్ మార్కెట్ మాత్రం అంతగాలేదనే చెప్పాలి. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు కూడా ఎవరు కొనడానికి ముందుకు రాకపోగా వచ్చిన కొద్దిమంది కూడా చిత్రా యూనిట్ అనుకున్నంతకు అడగలేదు. అందుకే ఏమి చేయలేక వాళ్ళే సొంతంగా విడుదల చేసుకున్నారు యూఎస్ లో. ఎందుకంటే ఇప్పటివరకు యూఎస్ మార్కెట్లో బాలయ్య సినిమా లెజండ్ చేసిన కలెక్షన్ కేవలం 2 కోట్లు. బాలయ్య కెరియర్లో అదే హైయెస్ట్. అయితే ఇప్పుడు వస్తున్న ‘పైసా వసూల్’ కు వీళ్ళు 5 కోట్లు అడుగుతున్నారట. దీనితో ఒక్క కొనుగోలుదారుడు కూడా సినిమాను కొనే సాహసం చేయట్లేదని తెలుస్తోంది.

బాలయ్య పాట ట్రాక్ రికార్డు చూసిన పూరీ బ్రాండ్ సినిమా అని మార్కెట్ చేసుకున్నా కూడా.. మరీ ఆ రేంజు సొమ్ము అంటే ఎవరు కొనడానికి వస్తారులే. అసలు ఇలా చెప్పి ప్రొడ్యూసర్ తన సినిమా మార్కెట్ పెంచుకుంటున్నాడు అనే వాదన కూడ వినపడుతుంది. ఈ సినిమాను వి.ఆనంద్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ముస్కాన్ సేథి.. శ్రీయ శరణ్.. బాలకృష్ణకు జంటగా నటిస్తున్నారు.

,  ,  ,  ,  ,