Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Apr-2016 12:12:43
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా దర్శకుడు ఎస్.జె.సూర్య తీస్తున్నాడని ఆల్రెడీ చెప్పేశాడు. అయితే ఈ సినిమా కథ ఏంటనేది చెబుతూ.. ''ఇది ఖుషీ సినిమా సీక్వెల్ కాదు. ఇదొక కొత్త సినిమా. ఫ్యాక్షన్ నేపథ్యంలో చోటుచేసుకునే ఒక ప్రేమ కథ'' అన్నాడు పవన్. ఇక్కడే అసలు సందేహాలు మొదలయ్యాయ్.

మ్యాటర్ ఏంటంటే.. గతంలో పవన్ ఇదే సబ్జెక్టును చాలాసార్లు టచ్ చేశాడు. మాఫియా నేపథ్యంలో ప్రేమ కథ.. ఒక ''బాలు''. చెల్లి సెంటిమెంట్ లో హైదరాబాద్ గూండాల నేపథ్యంలో ఒక ప్రేమ కథ.. ఒక ''అన్నవరం''. ఇక ఫ్యాక్షన్ నేపథ్యంలో తనకు పడని ఒక హీరోయిన్ తో ఒక ప్రేమలాంటి ప్రేమకథ.. ఒక ''బంగారం''. ఇవన్నీ పవన్ టచ్ చేసిన సబ్జెక్టులు. ఇప్పుడు ఫ్యాక్షన్ నేపథ్యంలో ప్రేమ కథ అంటే ఆ బంగారం సినిమాయే గుర్తొస్తోంది. మళ్లీ మళ్ళీ అవే కథలు ఎందుకు బంగారం? అంటున్నారు జనాలు.

నిజంగానే రామ్ గోపాల్ వర్మ చెప్పినట్లు తన ప్రక్కనున్న సలహాదారులకు పవన్ ఇమ్మీడియట్ గా మార్చేయాలేమో. లేకపోతే ఇప్పుడు అందరికీ ''బంగారం'' సినిమా.. దాని రిజల్ట్.. పదే పదే గుర్తొచ్చేత్తున్నాయి. పైగా తనకు ఎవరూ మంచి కథలు చెప్పకపోవడం వలనే.. పవన్ తనే సొంతంగా సర్దార్ కథ రాసుకున్నా అంటున్నాడు. అదేం కామెడీయో కాని.. మరి కత్తి - తుపాకి వంటి సినిమాలకు పవన్ ఎందుకు రిజక్టు చేసినట్లో?

,  ,  ,  ,  ,