Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-May-2017 10:36:18
facebook Twitter Googleplus
Photo

ప్రభాస్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూత్లో ఆయనకు ఉన్న భారీ ఫాలోయింగ్తో ప్రభాస్కు సంబంధించిన చిన్న వార్త అయిన కూడా భారీ క్రేజ్ సంపాదించుకుంటుంది. ఈ క్రమంలో ప్రభాస్కు సంబంధించి వ్యక్తిగత అంశాలు ఆసక్తులపై ఓ పత్రికలో ఆసక్తికరమైన కథనం వచ్చింది. ఇందులో కీలక అంశం ఏదైనా ఉందంటే...అది ప్రభాస్ ప్రత్యేకంగా వ్యక్తిగత ఆసక్తుల గురించి.

ప్రభాస్ తన కెరీర్ ద్వారా సంపాదించుకున్న వాటిలో ఆయన ఎక్కువగా ఖర్చు చేసేది కార్లు బంగళాల కోసం కాదట. ఎక్కువగా ఖర్చుపెట్టింది వాలీబాల్ కోర్ట్ కోసమట. ఔట్ డోర్ స్పోర్ట్స్ ఆడటానికి ఎక్కువగా ఇష్టపడే ప్రభాస్ సొంతంగా హైదరాబాద్ లోనే సాండ్ వాలీబాల్ కోర్ట్ నిర్మించుకున్నారు. ప్రభాస్ తన సమయాన్ని ఎక్కువగా స్నేహితులతో కలిసి సాండ్ వాలీబాల్ కోర్టులోనే గడుపుతారని తన సమయాన్ని-ఎనర్జీని ఇక్కడే ఖర్చు చేస్తారని పేర్కొంది. నాకు వాలీబాల్ ఆడటం అంటే చాలా ఇష్టం. సమయం చిక్కినప్పుడల్లా తన స్నేహితులతో కలిసి వాలీబాల్ ఆడటానికే సమయం కేటాయిస్తాను అని ఇటీవల ఇంటర్వ్యూలో ప్రభాస్ పేర్కొన్న విషయాన్ని వివరించారు.

ఇక ప్రభాస్కు ఉన్న మరో ఆసక్తి ట్రెక్కింగ్. దీంతో పాటుగా రాక్ క్లైంబింగ్ అంటే కూడా ప్రభాస్ కు ఇష్టమట. బాహుబలి-2లో ప్రభాస్ అంత ఫిట్ గా ఉండటానికి రాక్ క్లైబింగ్ కూడా ఎంతో తోడ్పడిందని విశ్లేషించింది. ఇక ప్రభాస్ మంచి చదువరి అని కూడా ఈ కథనం వివరించింది. తన ఇంట్లో ప్రభాస్కు సొంత లైబ్రరీ ఉందని ఎన్నో గొప్ప పుస్తకాలకు ఈ లైబ్రరీ వేదిక అని పేర్కొన్నారు.

,  ,  ,  ,  ,