Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Jun-2017 12:17:07
facebook Twitter Googleplus
Photo

సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలకు ప్రత్యేక స్థానం ఉంటుంది.. ఉండాలి కూడా. అయితే.. నిర్మాతగా కొనసాగుతూ ఉండగలగడం అనే విషయమే కాసింత క్లిషమైన విషయం. బాలీవుడ్ లో సుదీర్ఘ కాలంగా నిర్మాతగా కొనసాగుతూ.. తన పేరును ఓ బ్రాండ్ స్థాయికి చేర్చుకోగలిగిన నిర్మాతల్లో సాజిద్ నడియడ్వాలా ఒకరు.

భారీ బడ్జెట్ చిత్రాలు తీయడంతో పాటు కొత్తవారిని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయడంలో కూడా ఈయనకు మంచి గుర్తింపు ఉంది. టైగర్ ష్రాఫ్.. కృతి సనోన్ లతో చేసిన హీరోపంటి కూడా వీటిలో ఒకటి. ఇప్పుడీ నిర్మాతతో మన బాహుబలి సీక్రెట్ గా ఓ భేటీ వేశాడనే ప్రచారం సాగుతోంది. బాహుబలి2 సాధించిన ఘన విజయం తర్వాత.. ప్రభాస్ తో సినిమా చేసేందుకు బాలీవుడ్ మేకర్స్ మహా ఉత్సాహం చూపిస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ కూడా బాలీవుడ్ ఎంట్రీపై ఉత్సాహంగా ఉన్నాడనే అంటున్నారు. ఇలాంటి సమయంలో సాజిద్- ప్రభాస్ ల మీటింగ్ పై బాలీవుడ్ ప్రత్యేకంగా చర్చించుకుంోటంది.

ప్రభాస్ లాంటి మాచో హీరోను ఎలాగైనా బాలీవుడ్ కి పరిచయం చేయాలని భావిస్తున్నాడట ఈ నిర్మాత. ప్రొడ్యూసర్ మాత్రమే అయినా.. ఈయన డైరెక్షన్ వహించిన ఒకే ఒక చిత్రం సల్మాన్ ఖాన్ నటించిన కిక్. టాలీవుడ్ కిక్ కి రీమేక్ గా రూపొంది సక్సెస్ సాధించగా.. ఇప్పుడు ప్రభాస్ హీరోగా మళ్లీ తన దగ్గరగా సిద్ధంగా ఉన్న స్క్రిప్ట్ తో స్వీయ దర్శకత్వంలో నిర్మించాలని చూస్తున్నాడట సాజిద్ నడియడ్వాలా.

,  ,  ,  ,  ,