Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-May-2017 11:13:51
facebook Twitter Googleplus
Photo

బాహుబలి ది కంక్లూజన్ మూవీ కోసం జనాలు విపరీతంగా ఎదురుచూడడానికి.. ఇప్పుడు ఈ స్థాయి వసూళ్లు సాధించడానికి వెనక.. ఓ ప్రశ్న కారణంగా నిలుస్తోంది. రెండేళ్లుగా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న జనాల నోళ్లలో విపరీతంగా నానింది.

బాహుబలి మేకర్స్ కూడా #WKKB(వై కట్టప్ప కిల్డ్ బాహుబలి) అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి.. దాన్నే పోస్టర్లలో వేసి ఆసక్తిని పెంచుతూనే ఉన్నారు. ఇప్పుడు బాహుబలి2 రిలీజ్ తర్వాత ఆన్సర్ దొరికేసింది. మరీ ఊహించలేనంత గొప్ప ట్విస్ట్ ఏమీ లేదు కానీ.. కట్టప్ప పొడవడానికి కారణం కన్విన్సింగ్ గానే ఉంది. అయితే.. రీసెంట్ గా ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో.. ప్రభాస్ కు కూడా తెలియదట. దానికి ఆన్సర్ తెలుసుకునేందుకు జనాలతో కలిసి థియేటర్లలోనే చూసి.. తెలుసుకుని ఆశ్చర్యపోయాడట.

ఆ ప్రశ్నకు సమాధానం ఎక్కువ మందికి తెలియదు.. ఊహించడం అంటూ ఇప్పటివరకూ బాహుబలి టీం చెప్పినదాని కంటే.. ఇది మాత్రం మరీ కామెడీగా ఉంది. పొడిచిన వాడికి.. పొడిపించుకున్న వాడికి కూడా అసలు సీక్రెట్ తెలియదన్న మాట. రిలీజ్ కి ముందు వరకూ అంటే ఏం చెప్పినా సెన్సేషన్ అవుతుంది.

,  ,  ,  ,  ,  ,