Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Feb-2017 11:23:35
facebook Twitter Googleplus
Photo

తమిళ హీరోల్లో స్టార్ హీరోలు, మామూలు హీరోలు అని తేడా లేకుండా చా లామంది తరచు తమ సినిమాల్ని డబ్ చేసి తమిళంలో పాటే తెలుగులో కూడా ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నారు. మన తెలుగు ప్రేక్షకులు కూడా తమిళులు చేసే ప్రయోగాలు పట్ల ఆసక్తి కొద్ది ఆ సినిమాల్ని, హీరోలని ఆదరిస్తున్నారు. అలాంటి హీరోల్లో విజయ్ ఆంటోనీ కూడా ఒకరు. నకిలీ చిత్రంతో ప్రారంభమైన ఆయన తెలుగు చిత్ర యాత్ర డా. సలీమ్, బిచ్చగాడు, బేతాళుడు తో దిగ్విజయంగా సాగుతూ ఇప్పుడు యమన్ తో మరో ముందడుగు వేయనుంది.
ఇప్పటికే తెలుగు థియేటర్లకు బాగా సుపరిచితుడైన విజయ్ ఆంటోనీ యమన్ చిత్రం ద్వారా మన ఆడియన్సుకి మరింత దగ్గరవ్వాలనుకుంటున్నారు. అందుకే తమిళంతో సమానంగా ఇక్కడ కూడా భారీ స్థాయి ప్రమోషన్లు నిర్వహిస్తూ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ శుక్రవారం రిలీజ్ కానున్న ఈ చిత్రంపై ఎన్నడూ ఏ తమిళ సినిమాపై లేని విధంగా మంచి అంచనాలున్నాయి. పైగా విడుదలయ్యే థియేటర్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దీన్నిబట్టి ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తే విజయ్ ఆంటోనీ రెగ్యులర్ తెలుగు హీరోల్లా మన ప్రేక్షకులకు గుర్తుండిపోవడం ఖాయం.

,  ,  ,  ,  ,