Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Apr-2017 10:09:42
facebook Twitter Googleplus
Photo

రాజమౌళి అన్నట్లుగా ఏ స్టార్ హీరో అయినా ఒక సినిమా కోసం తన కెరీర్లో నాలుగేళ్ల సమయాన్ని ఇస్తాడా? ఐతే ప్రభాస్ ఇచ్చాడు. బాహుబలి సినిమాకే నాలుగేళ్ల పాటు అంకితమైపోయాడు. ఈ కాలంలో అతను ఎన్ని సినిమాలు చేసి ఉండొచ్చో. ఎంత డబ్బు సంపాదించి ఉండొచ్చో. కానీ బాహుబలి లాంటి సినిమా కోసం నాలుగేళ్ల సమయం వెచ్చించినందుకు తనకు ఎంత మాత్రం బాధ లేదంటున్నాడు ప్రభాస్.

బాహుబలి కోసం కేటాయించిన నాలుగేళ్లలో 8 సినిమాలు చేసుకుని ఉండొచ్చని కొందరన్నారని.. ఎనిమిది కాదు ఇంకో ఎనిమిది కలుపుకుని 16 సినిమాలు చేసి ఉన్నా బాహుబలి వల్ల వచ్చిన గుర్తింపు ముందు తక్కువే అనిపిస్తుందని... ఈ సినిమా కోసం చేసిన జర్నీ ఎప్పటికీ మర్చిపోలేనిదని ప్రభాస్ అన్నాడు. తన జీవితాన్ని పుస్తకంగా రాసుకుంటే అందులో 30 శాతం బాహుబలి గురించే ఉంటుందని ప్రభాస్ చెప్పాడు.

బాహుబలి విషయంలో తనను అత్యంత టెన్షన్ పెట్టిన విషయం గురించి చెబుతూ.. ఈ సినిమా కోసం శారీరకంగా.. మానసికంగా చాలా కష్టపడ్డాం. షూటింగ్ సమయంలో బడ్జెట్ సంగతులే నన్ను అన్నిటికన్నా ఎక్కువగా కంగారు పెట్టేది. ఎక్కడ అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుందో అని భయపడేవాళ్లం.

,  ,  ,  ,  ,