Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-May-2017 10:39:46
facebook Twitter Googleplus
Photo

బాహుబలి2 సాధిస్తున్న రికార్డులు అసాధారణం. అద్వితీయం. మరో ఐదేళ్ల వరకూ ఈ సినిమా రికార్డులను ఎవరూ టచ్ చేయలేకపోవచ్చని.. అప్పటికి కూడా సినిమా ప్రేక్షకుల సంఖ్య.. థియేటర్ల సంఖ్య.. టికెట్ రేట్లు పెరుగుతాయ్ కాబట్టే.. బాహుబలి రికార్డులను అందుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన ప్రభాస్ కు ఎనలేని ఖ్యాతి దక్కుతోంది.

అయితే.. బాహుబలి ఫ్లాప్ అనేసరికి ఒకానొక సమయంలో తెగ దిగాలు పడిపోయాడట. ఈ విషయాన్ని స్వయంగా తనే చెప్పాడు ప్రభాస్. రీసెంట్ గా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాహుబలి ది బిగినింగ్ నాటి సంగతులు చెప్పాడు. బాహుబలి పార్ట్ 1 రిలీజ్ అయినపుడు.. మొదటి రోజునే ఫ్లాప్ టాక్ వచ్చింది. తెలుగు వెర్షన్ విషయంలో నిజంగానే డివైడ్ టాక్ ఎక్కువగా స్ప్రెడ్ అయింది. అంచనాలకు తగినట్లుగా లేదని విమర్శలు రిలీజ్ రోజునే వెల్లువెత్తాయి. దీంతో రెండున్నరేళ్ల కష్టం వృథా అయిపోయిందని తెగ బాధపడిపోయిన ప్రభాస్.. రూంలోంచి బయటకు కూడా రాలేకపోయాడట.

కానీ ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ కు మాత్రం సూపర్ హిట్ టాక్ వచ్చిందని.. బాలీవుడ్ నుంచి తెలిసిన ప్రతీ ఒక్కరూ ఫోన్ చేసి అభినందనలు తెలుపుతుంటే షాక్ కు గురయ్యానని చెప్పాడు ప్రభాస్.

,  ,  ,  ,  ,  ,