Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-May-2017 10:16:06
facebook Twitter Googleplus
Photo

పూరీ జగన్నాధ్ సినిమాల విషయంలో బోలెడన్ని రూమర్స్ తిరుగుతూ ఉంటాయి. చిన్న పెద్దా అన్ని విషయాలపైనా రకరకాల గాసిప్స్ చక్కర్లు కొడుతున్నా పూరీ మాత్రం వాటిని పక్కాగా పబ్లిసిటీ యాంగిల్ లో చూస్తాడు తప్పితే.. ఎలాంటి రియాక్షన్ ఇచ్చే అలవాటు ఈయనకు లేదు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో సినిమా చేస్తున్నాడు పూరీ జగన్నాధ్.

బాలయ్య 101 విషయంలో తన ట్యాలెంట్ అంతా చూపించేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పోర్చుగల్ లో జరుగుతున్నపుడు.. ఛార్మీ అక్కడ తేలడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయినా సరే పూరీ ఈ విషయంలో రియాక్ట్ కాలేదు. ఇప్పుడు బాలయ్య మూవీకి పూరీ జగన్నాధ్ కూతురు పవిత్ర.. అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తోందని అంటున్నారు. నిజానికి ఈమెకు హీరోయిన్ అవాలనే కోరిక ఉందని.. ప్రస్తుతం తండ్రి దగ్గరే ట్రైనింగ్ తీసుకునేందుకు గాను.. బాలయ్య మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తోంది అంటున్నారు.

బాలకృష్ణ సినిమా విషయంలో ఛార్మీ.. పవిత్రల పేర్లు వినిపిస్తున్నా.. వాటిని అధికారికంగా మాత్రం చెప్పలేదు పూరీ.

,  ,  ,  ,  ,  ,