Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Jul-2017 13:58:14
facebook Twitter Googleplus
Photo

స్పైడర్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎదురుచూపులుకు తెరదించే సుముహర్తం దగ్గర పడింది. సినిమా ఫస్ట్ లుక్ తరువాత ఒక్క ఫోజ్ కూడా విడుదల చేయని స్పైడర్ టీమ్ ఇప్పుడు గేర్ మార్చి దూకుడుగా ప్రచారం మొదలుపెట్టింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో మహేశ్ బాబు అభిమానులు కొంత ఊపిరి పీలుచుకున్నారు. ఇప్పటికే బాగా ఆలస్యమైన ఈ సినిమా మరేంత ఆలస్యం అవుతుందో అని వాళ్ళు తెగ కంగారుపడి పోయారు అనుకోండి. స్పైడర్ టీమ్ ఇప్పుడు ఒక తేది చెప్పేసారికి వాళ్ళ ఆనందానికి అడ్డు ఆపు లేకుండా పోయింది.

అయితే సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఒక అంచనా ఉన్నా స్పైడర్ సినిమాకు సంభందించిన ఒక్క స్టిల్ కూడా లేకపోవడం తో తీవ్ర నిరాశ చెందారు. ఇప్పుడు ఫ్యాన్స్ నిరాశకు ఒక సమాధానం దొరికినట్లు అయ్యింది. మహేశ్ సినిమా స్పైడర్ లో ఒక కొత్త పోస్టర్ లు ఆదివారం విడుదల చేశారు. ఈ సినిమాలో మహేశ్ పై చిత్రీకరించిన ఒక పాటలో ఇలా ఉండబోతున్నాడు అని తెలుస్తుంది. బూం బూం అనే పాట లో ఇలా బ్లాక్ షర్ట్ కార్గో పాంట్ వేసుకొని తనకు కుదిరే కళ్ళజోడు తో అదరగొట్టేశాడు సూపర్ స్టార్. ఆగష్టు 2 న ఈ పాట విడుదల చేస్తారు అని తెలుస్తుంది. ఏమైతే ఏమి మొత్తానికి మహేశ్ సినిమా ప్రచారం మొదలుపెట్టాడు అంటే ఇంకా అసలు పండుగ మొదలైంది అనమాట.

ఇంత వరకు వచ్చిన పోస్టర్ లలో మహేశ్ కేవలం స్పై లా మాత్రమే కనిపించాడు కానీ ఈ కొత్త పోస్టర్ లో క్లాస్ స్టైలిష్ కి కేరాఫ్ అడ్రెస్ గా ఉన్నాడు అనే చెప్పాలి. ఈ సినిమా టీజర్ కూడా ఆగష్టు 9న మహేశ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,