తెలుగులో చెప్పాలంటే దిగాంబరంగా హగ్ అనాలి.. అదే ఇంగ్లీషు టచ్చింగ్ ఇస్తే.. న్యూడ్ అని చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుతం మెహబూబా సినిమాను చేస్తున్న దర్శకుడు పూరి జగన్ మనస్సు ఎందుకు అటు మళ్ళిందో తెలియదు కాని.. ఇప్పుడు తన కెరియర్ లోనే తొలిసారిగా ఈయన ఒక షార్ట్ ఫిలింతో వస్తున్నారు. ఆ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు రిలీజ్ చేశాడు.
అక్కడ చూస్తున్నారుగా.. పచ్చ చెట్ల మధ్యన.. అదేదో అడవి వంటి వాతావరణంలో.. ఒక స్ర్తీ దిగాంబరంగా చెట్టు బెరడును కౌగిళించుకుని నుంచుంది. ఈ న్యూడిటీ ఏంటో.. ఆ ఫారిన్ అమ్మాయి ఎవరో తెలియదు కాని.. డిసెంబర్ 31న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు పూరి జగన్. ఆ రోజు అందరికీ చాలా పెద్ద ట్రీట్ అందిస్తున్నా అని చెబుతున్నాడు. సంగీత దర్శకుడు సందీప్ చౌతా.. ఎడిటిర్ జునేద్ సిద్దికిలతో ఈ సినిమాకు కావల్సినంత సాంకేతిక సాయం తీసుకొచ్చాడట. పూరి కనక్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.
ఇంతకీ పూరి ఏం చెప్పాలని చూస్తున్నాడు? దిగంబరంగా ఉన్న అమ్మాయి.. దిగంబరంగా ఉన్న చెట్లకు హగ్గులివ్వడం గట్రా చూస్తే.. ఇదేదో ప్రకృతి పర్యావరణం అంటూ పూరి ఓ రేంజు క్లాసు తీసుకునేట్లు కనిపిస్తున్నాడు.