Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Oct-2016 11:22:09
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు-పూరి జగన్నాథ్ లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. ?పోకిరి? లాంటి ఇండస్ట్రీ హిట్ తో వీళ్ల కాంబినేషన్ మొదలైంది. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి ?బిజినెస్ మేన్?కు పని చేశారు. ఆ సినిమా ?పోకిరి?లా రికార్డులు బద్దలు కొట్టేయలేదు కానీ.. హిట్ అయింది. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ వస్తుందని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో సైతం తన తర్వాతి సినిమా మహేష్ బాబు తోనే అన్నాడు. మధ్యలో తమ ఇద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా అంటూ ?జనగణమన? పేరుతో ఒక పోస్టర్ కూడా వదిలాడు. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు.

మహేష్ బాబు మురుగదాస్ దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టేశాడు. కొరటాల శివ సినిమాను కూడా లైన్లో పెట్టాడు. ఇంకా త్రివిక్రమ్ కూడా మహేష్ తో ఓ సినిమా చేయడానికి వెయిట్ చేస్తున్నాడు. మరి ఈ ప్రాజెక్టుల మధ్య పూరితో మహేష్ సినిమా సంగతే ఏం తేలడం లేదు. ఇదే విషయాన్ని పూరి దగ్గర ప్రస్తావిస్తే.. ??ఆ మధ్య మహేష్ బాబుకు కథ చెప్పాను. అతడికి నచ్చింది. అతను రెడీ అంటే సినిమా చేద్దామనుకుంటున్నా. కానీ మహేష్ నుంచి ఆ తర్వాత జవాబు లేదు. ఇంకేం చేయాలి? తన ఆన్సర్ కోసమే వెయిట్ చేస్తున్నా?? అని పూరి అన్నాడు. మహేష్-పూరి మధ్య అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. తనకు ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడి మీద మహేష్ కు ఎంతో గౌరవం ఉంది. మరి మహేష్ తన సినిమా విషయంలో ఎందుకు సైలెంటుగా ఉన్నాడో పూరి అడగలేకపోయాడా..? అతను జవాబు చెప్పేవరకు వెయిట్ చేస్తూ ఉంటాడా..?

,  ,  ,  ,  ,