Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Sep-2016 12:36:17
facebook Twitter Googleplus
Photo

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన జనతా గ్యారేజ్ కు ప్రేక్షకుల ఆదరణే కాదు.. భారీ వసూళ్లు కూడా దక్కుతున్నాయి. రెండో వీకెండ్ లోకి ఎంటర్ అయిన గ్యారేజ్.. కొంచెం స్లో అయింది కానీ.. కలెక్షన్స్ మాత్రం బాగానే వస్తున్నాయి. ఇప్పటికే ఇండస్ట్రీ ప్రముఖుల్లో చాలామంది గ్యారేజ్ మేకింగ్ స్టైల్ ను.. ఎన్టీఆర్ యాక్టింగ్ ట్యాలెంట్ ను తెగ పొగిడేస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి బ్యాడ్మింటన్ ప్లేయర్ - ఒలింపిక్ మెడల్ విన్నర్ పీవీ సింధు.. ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా చేరారు.

పుల్లెల గోపీచంద్.. పీవీ సింధులతో పాటు హైద్రాబాద్ బ్యాడ్మింటన్ లీగ్ ప్రెసిడెంట్ చాముండేశ్వరీనాథ్ లు వారి వారి కుటుంబాలతో కలిసి.. హైద్రాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జనతా గ్యారేజ్ స్పెషల్ షో చూశారు. అద్భుతమైన కంటెంట్ ని అందించిన టీంని అభినందనల్లో ముంచెత్తారు. 'సినిమా సూపర్ గా ఉంది. స్టోరీ బలం ఉన్న సినిమా ఇది. మోహన్ లాల్.. ఎన్టీఆర్ లు తమ నటనతో కట్టిపడేశారు. ఇంత మంచి మూవీ ఇచ్చిన యూనిట్ కు.. డైరెక్టర్ కొరటాల శివకు అభినందనలు' అని చెప్పాడు పుల్లెల గోపీచంద్.

'జనతా గ్యారేజ్ ను విపరీతంగా ఎంజాయ్ చేశాను. ఎన్టీఆర్ సూపర్బ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు.' అంటూ పీవీ సింధు చెప్పింది. సినిమావాళ్లనే కాకుండా స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ని కూడా జనతా గ్యారేజ్ కట్టిపడేస్తోంది.

,  ,  ,  ,  ,  ,  ,