మహేష్ బాబుతో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ పీవీపీ సినిమా ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తాడు. ఇందుకు సంబంధించిన చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయి. శ్రీకాంత్ చెప్పిన స్టోరీ లైన్ కి మహేష్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు. గతంలో శ్రీకాంత్ తో మహేష్ చేసిన మల్టీ స్టారర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా పేరు తెచ్చుకున్న సంగతి విదితమే. ప్రస్తుతం తాను చేస్తున్న 'ముకుంద' సినిమా విడుదలకు సిద్ధం కావడంతో దర్శకుడు శ్రీకాంత్ ఇక మహేష్ సినిమాపై దృష్టి పెడతాడని సమాచారం. వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ఇది సెట్స్ కి వెళుతుంది.
maheshbabu, pvp, srikanthaddala, tollywood, news,