Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jul-2015 14:10:39
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ పై రాధికా ఆప్టే కోపంతో రుసరుసలాడుతోంది .. ఇక్కడి నుంచి అవకాశాలు వెతుక్కుంటూ వెళుతున్నా చెయ్యను పొమ్మంటోందట. పారితోషికం తక్కువైందా అంటే, కాదు .. టాలీవుడ్లో హీరోల ఆధిక్యత ఎక్కువైంది.. అక్కడ కొంతమంది దర్శకనిర్మాతలకి స్త్రీల పట్ల గౌరవం లేదంటూ చిటపటలాడుతుందనే వార్త షికారు చేస్తోంది. ఇంతా చేస్తే తెలుగులో ఆమె రెండు మూడు సినిమాలకి మించి చేయనే లేదు. ఆ మాటకొస్తే ఒక్క హిందీలో మినహా ఆమె ఇతర భాషల్లో చేసినవి చాలా తక్కువే.


తెలుగు చిత్రపరిశ్రమకి ఇతర భాషల నుంచి ఎంతోమంది కథానాయికలు వస్తున్నారు. వాళ్లలో చాలామంది సంవత్సరాలుగా అగ్ర కథానాయికలుగా వెలుగొందుతూ వున్నారు. వాళ్లెవరి విషయంలోనూ జరగని లోటు .. లోపం రాధికకి ఎందుకు జరుగుతుందని కొంతమంది అనుకుంటూ వుంటే, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే సామెతను మరికొందరు గుర్తుచేస్తున్నారు.

,  ,