Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Aug-2015 13:54:15
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడున్న హీరోయిన్లలో బాగా గట్స్ ఎవరికి ఉన్నాయి? కొన్నాళ్ల క్రితం వరకూ అయితే.. ఈ ప్రశ్నకు సమాధానాన్ని కాస్త ఆలోచించాలి. ఇప్పుడా సమస్య లేదు. అటు బాలీవుడ్ ప్రముఖులని అడిగినా. ఇటు మూవీ ఫ్యాన్స్ ని అడిగినా వచ్చే సమాధానం ఒకటే. అందరూ ముక్తకంఠంతో చెప్పేది ఒక పేరే. అదే రాధికా ఆప్టే.

బద్లాపూర్ మాంఝీ వంటి విభిన్న కథాంశాల్లో నటింటింది రాధిక. ఆ తర్వాత అహల్య వంటి షార్ట్ ఫిలింతోనూ సంచలనం సృష్టించింది. దీని తర్వాత అనురాగ్ కశ్యప్ రూపొందిస్తున్న మరో షార్ట్ ఫిలిం కోసం తీసిన బాటమ్ న్యూడ్ సీన్... ఇంటర్నెట్ లో లీకయ్యి సెన్సేషన్ సృష్టించింది. ఈ ఒక్క సీన్ తోనే ఆ ఫిలిం ఎలా ఉంటుందో అర్ధమయిపోయింది. ఇక ఇప్పుడీ భామ హోమో సెక్సువల్ కేరక్టర్ లోనూ నటించనుందనే న్యూస్ హల్ చల్ చేస్తోంది. అందులో లీడ్ కేరక్టర్ రాధికాఆప్టేదే కావడం హైలైట్. మామూలుగా అయితే వేశ్య కేరక్టర్ చేసో మేకప్ లేకుండా నటించో డీగ్లామర్ రోల్ తోనో... విభిన్నంగా చేశామని వెరైటీ ట్రై చేశామని డప్పాలు కొట్టేసుకుంటారు నటీమణులు. ఇలాంటి సొల్లు జోలికి పోకుండా... చేయాల్సిందంతా చేసేస్తున్న రాధికాని చూస్తుంటే... ఈమెకు చాలా ధైర్యం ఉందనిపిస్తోంది కదూ.

పేరు తెచ్చుకోవాలంటే గాసిప్ లు ఎఫైర్లు అక్కర్లేదు యాక్టింగ్ చేసే సత్తా ఉంటే చాలని ప్రూవ్ చేస్తోందీ అమ్మడు. రెండు దశాబ్దాలకు పూర్వం ఫైర్ అనే మూవీ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. మళ్లీ ఇప్పుడు అదే టైప్ కేరక్టర్ తో ఓ ఫేమస్ హీరోయిన్ తెరమీదకొస్తోంది. ఈ సినిమాలో ఇంటిమేట్ సీన్స్ చాలానే ఉంటాయని బాలీవుడ్ టాక్.

,  ,