Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Sep-2016 12:31:57
facebook Twitter Googleplus
Photo

వ‌రుస‌గా మూడు హిట్లు కొట్టి హ్యాట్రిక్ హీరో అనిపించుకొన్నాడు నాని. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, కృష్ణ‌గాడివీర ప్రేమ‌గాథ‌, జెంటిల్మెన్ చిత్రాలతో అదరగొట్టాడు. ఇప్పుడు మజ్ను కూడా హిట్ బాట పట్టింది . ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

దీంతో ఇప్పుడు నానిపై ప్రసంసల జల్లు కురుస్తుంది. అటు ఇండస్ట్రీ జనాలు కూడా నాని అభినందిస్తున్నారు. నాని హిట్ల పై హీరో సుమంత్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా వుంది. ?బైట వర్షం కన్నా, నీ హిట్ల వర్షం ఎక్కువైపోతుంది, బాబాయ్?అంటూ ట్వీట్ చేసిన సుమంత్ నానీకి కంగ్రాట్స్ చెప్పాడు.

సుమంత్ తో పాటు దర్శకుడు హరీష్ శంకర్, ఇంద్రగంటి. హీరో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి అతదితరులు నానీకి అభినందనలు తెలిపారు. ఈ సినిమాతోప్రేక్షకుల హృదయాలను నానీ మళ్ళీ గెలుచుకున్నాడని కితాబిచ్చారు.

,  ,  ,  ,  ,  ,  ,