Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Feb-2017 11:55:42
facebook Twitter Googleplus
Photo

షో టైం అంటూ.. తెలుగులో ఓ మూవీ రూపొందుతోంది. చాలా నెలల క్రితమే టీజర్ రిలీజ్ చేసుకున్న ఈ చిత్రాన్ని.. దర్శకధీరుడు రాజమౌళి సోదరుడు కంచి దర్శకత్వంలో తెరకెక్కించారు. తాజాగా ఆడియో లాంఛ్ జరుపుకున్న షో టైం ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. దాదాపుగా రాజమౌళి ఫ్యామిలీ మెంబర్స్ లో చాలామంది ఈ మూవీకి వర్క్ చేయడం విశేషం.

థియేటర్ కి వచ్చేవాళ్లందరూ సినిమా చూడ్డానికి కాదు.. అనే థీమ్ పై ఈ మూవీ రూపొందింది. ఈ మూవీ ఆఢియో ఫంక్షన్ లో మాట్లాడుతూ.. ముఖ్యంగా ట్రైలర్.. పాటల గురించి మాట్లాడాడు జక్కన్న. ' ట్రైలర్ లో వినిపించిన డైలాగ్స్ వింటుంటే.. ఇలాంటి సిట్యుయేషన్స్ మనంచాలా మంది ఫేస్ చేసి ఉంటాం. వెనుక రోస్ లో ఉండే వాళ్లు విసిగించే వాళ్లు సందర్భాలు కోకొల్లలు. ఇప్పుడు కంచి అన్న వాళ్లను ఎలా పనిష్ చేయబోతున్నాడనే ఆసక్తి కలుగుతోంది' అని చెప్పాడు రాజమౌళి. ట్రైలర్ చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు చూద్దామా అనుకుంటున్నానన్న రాజమౌళి.. టీజర్ తోనే చాలా ఇంట్రెస్ట్ చేశారని చెప్పాడు.

'షో టైంలో పాటలు వింటూ.. బాగుందని ఒక పాటను మళ్లీ వినిపించమన్నాను. అందరూ నా వంక అదోలా చూసి మళ్లీ ప్లే చేశారు. అప్పటికి కూడా నాకు అసలు విషయం తెలియలేదు.ఇంతకీ సంగతేంటంటే.. ఆ పాటను కార్తికేయ పాడాడు. నాకు కార్తికేయ అసలు పాడతాడని కానీ.. ఇంత చక్కగా పాడతాడని కూడా తెలీదు. మా ఫ్యామిలీలో భైరవకు బ్రహ్మాండమైన బేస్ వాయిస్ వచ్చింది. మంచి సింగర్ అవుతాడని.. అలాగే షోటైం ట్రైలర్ లో చూపించినట్లుగా.. అన్ని సీట్స్ ఫుల్ అవాలని కోరుకుంటున్నా' అన్నాడు రాజమౌళి. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

,  ,  ,  ,  ,  ,  ,