Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Nov-2017 10:16:19
facebook Twitter Googleplus
Photo

టాప్ హీరోయిన్స్ మధ్య ఇప్పుడు పోటీ గట్టిగా నడుస్తోంది. అయితే ఎంత పోటీ జరిగినా భామలు ఎవరి స్థాయిలో వారు క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు. సక్సెస్ ఫెయిల్యూర్ సంగతి పక్కనపెట్టి అవకాశాలను దక్కించుకుంటున్నారు. అదే తరహాలో రకుల్ కూడా పయనిస్తోంది. ఈ మద్య అపజయాలను ఎక్కువగా చూస్తున్నా అమ్మడి గత సక్సెస్ లే ఇప్పుడు అవకాశాలను ఇస్తున్నాయి. అయితే ఈ శుక్రవారం రిలీజ్ కాబోతోన్న ఖాకి సినిమాపై రకుల్ ఆశలు బాగానే పెట్టుకుంది.

సినిమాకి ప్రమోషన్స్ కూడా చేస్తోంది. ఇక రీసెంట్ గా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన రకుల్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. రకుల్ మాట్లాడుతూ.. ఖాకి సినిమాలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. సరైనోడు సినిమా నుంచి కొత్తగా ఉండే పాత్రలను ఎంచుకుంటున్నాను. ఇక ఖాకి సినిమాలో నా పాత్ర నాటి క్యూటీ అనేట్లుగా ఉంటుంది. కథ నిజ జీవిత ఆధారంగా కొత్తగా ఉండటం వల్ల సినిమాను ఒకే చేశాను. మొదట నన్ను ఎంచుకున్నప్పుడు దర్శకుడు వినోద్ హీరో కార్తీ కొంచెం భయపడ్డారు. అసలు తమిళ అమ్మాయిలా చేయగలదా అని డౌట్ పడ్డారు. కానీ నేను ఎంతో ఇష్టంగా ఆ పాత్రను చేశాను.

తెలుగు అంటే కూడా ఎంతో ఇష్టం. నన్ను మీరు ఎంతో ఆదరిస్తున్నారు. టాలీవుడ్ ని నేను ఎప్పటికి వదిలి వెళ్లాను. పవన్ కళ్యాణ్ తో నటించాలని ఉంది. ఒకసారి అభిమానులు పవన్ కళ్యాణ్ ని అడిగితే బెటర్. విజయ దేవరకొండతో కూడా నటిస్తా. అతను మంచి యాక్టర్. ఇక మహేష్ బాబు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన చాలా ప్రొఫెషినల్. మహేష్ తో నటించినందుకు చాలా హ్యాపీగా ఉంది. లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడానికి నాకు అభ్యంతరం లేదు. కథ నచ్చితే చేసేస్తాని రకుల్ చెప్పింది.

,  ,  ,  ,  ,